హైదరాబాద్: ముంబై వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న తొలి వార్మప్ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా-కేఎల్ రాహుల్‌లు జట్టుకు చక్కటి శుభారంభాన్ని ఇచ్చారు.
వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 147 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇన్నింగ్స్ 25.1వ ఓవర్లో శాంట్నర్ బౌలింగ్‌లో ఓపెనల్ కేఎల్ రాహుల్ 68 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కరుణ్ నాయర్ 78 పరుగులతో అర్ధసెంచరీని నమోదు చేశాడు.

ఈ ముగ్గరూ మినహా జట్టులోని మిగతా ఆటగాళ్లు పెద్దగా రాణించలేదు. న్యూజిలాండ్ బౌలర్ బౌల్ట్ 9 ఓవర్లు వేసి 38 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. ముంబై బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ బోర్డు ఎలెవన్ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కివీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు జట్టులో చోటు కోల్పోయిన కేఎల్ రాహుల్‌కు సెలక్టర్లు రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో చోటు కల్పించారు.
ఇదిలా ఉంటే అక్టోబర్ 22 నుంచి భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ సిరిస్‌కు ముందు కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్ జట్టు బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుతో రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడుతుంది.
భారత్‌లో న్యూజిలాండ్ పర్యటన వివరాలు:
Oct 17 (Tuesday): 1st warm-up match at CCI, Mumbai
Oct 19 (Thursday): 2nd Warm-up match at CCI, Mumbai
Oct 22 (Sunday): 1st ODI in Mumbai - 1:30 PM
Oct 25 (Wednesday): 2nd ODI in Pune - 1:30 PM
Oct 29 (Sunday): 3rd ODI in Kanpur - 1:30 PM.
మూడు టీ20లు:
Nov 1 (Wednesday): 1st T20I in Delhi - 7 PM
Nov 4 (Sunday): 2nd T20I in Rajkot - 7 PM
Nov 7 (Wednesday): 3rd T20I in Thiruvananthapuram - 7 PM