
అభ్యర్థనపై ఇంకా ఎలాంటి నిర్ణయం
అయితే.. ఆ వార్తల్ని శుక్రవారం డయానా ఖండించింది. ‘కోహ్లీ అభ్యర్థనపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తుది నిర్ణయం తీసుకోవడానికి ఇంకా చాలా మంది అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉంది. బుధవారం వచ్చిన వార్తలో నిజం లేదు' అని డయానా స్పష్టం చేసింది. బీసీసీఐ పాత నిబంధన ప్రకారం విదేశీ పర్యటనలో ఆటగాళ్ల వెంట భార్య/ ప్రియురాలు 14 రోజులకి మించి ఉండరాదు.

స్పష్టత వచ్చేందుకు మరింత సమయం
విదేశీ పర్యటనలకు తమ భాగస్వాములను తీసుకెళ్లే అంశంపై మరిన్ని అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై స్పష్టత వచ్చేందుకు మరింత సమయం
పట్టే అవకాశముందని ఓ వార్తా సంస్థతో పేర్కొన్నారు. ప్రస్తుతం విదేశీ పర్యటనల్లో తమ భాగస్వాములు తమతో కేవలం రెండు వారాలు మాత్రమే ఉంటున్నారని, ఈ సమయం పెంచాలని కొహ్లీ బీసీసీఐని అభ్యర్థించిన విషయం తెలిసిందే. అతడి అభ్యర్థనపై స్పందించిన బీసీసీఐ విధానాన్ని మార్చిందంటూ వార్తలొచ్చాయి.

భార్యలు ఉంటే జట్టులో సానుకూల వాతావరణం
మొదటి పది రోజులు మినహా పర్యటన పూర్తయ్యే వరకు క్రికెటర్ల భార్యలను వారితో ఉండనివ్వాలని నిర్ణయించినట్లు బుధవారం వార్తలు వచ్చాయి. భార్యలు ఉంటే జట్టులో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని పరిపాలకుల కమిటీ అభిప్రాయపడినట్లు సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన పాలకుల కమిటీ సభ్యురాలు, మహిళా క్రికెట్ జట్టు మాజీ సారథి డయానా ఎదుల్జీ.. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టత ఇచ్చారు.

నవంబరులో భారత్ జట్టు ఆస్ట్రేలియా పర్యటన
అయితే.. ఒక రోజు ముందు వెలువడిన వార్తల ప్రకారం.. విదేశీ పర్యటన ఆరంభమైన 10 రోజుల తర్వాత ఆటగాళ్లతో భార్య/ ప్రియురాలు ఉండేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చిందని.. పర్యటన ముగిసే వరకూ వారు అక్కడే ఉండొచ్చన్నట్లు వార్తలు వచ్చాయి. నవంబరులో భారత్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లనుంది.


Click it and Unblock the Notifications












