Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అంధుల వరల్డ్‌కప్ విజేతగా భారత్: పాకిస్థాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ

Blind Cricket World Cup

హైదరాబాద్: అంధుల వరల్డ్ కప్‌లో భారత జట్టు సత్తా చాటింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ వరుసగా రెండోసారి విజేతగా అవతరించింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత పాకిస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో నిర్ణీత 40 ఓవర్లలో పాకిస్థాన్ 8 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. పాక్ బ్యాట్స్ మెన్లలో బాదర్‌ మునిర్‌ హాఫ్ సెంచరీ, రియాసత్‌ ఖాన్‌ 48, సారథి నిసార్‌ అలీ 47 రాణించారు. అనంతరం 309 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 38.2 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది.

చేధనలో 93 పరుగులతో సునీల్ రమేష్ అద్భుత ప్రదర్శన చేయగా, కెప్టెన్ అజయ్ రెడ్డి కూడా 62 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్లు నుంచి భారత్‌కు శుభారంభం దక్కడంతో 15 ఓవర్లకు ఒక వికెట్‌ నష్టపోయి 111 పరుగులతో నిలిచింది. ఆ తర్వాత వెంటవెంటనే రెండు వికెట్లు చేజార్చుకోవడంతో 16 ఓవర్లు ముగిసే సరికి 116/3తో నిలిచింది.

ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన సునీల్ రమేశ్ (93), కెప్టెన్ అజయ్‌ రెడ్డి (62) బాధ్యాతాయుతంగా ఆడి స్కోరు బోర్డుని పరిగెత్తించారు. ఆ తర్వాత ఔట్‌ కావడంతో ఆట ఉత్కంఠ భరితంగా మారింది. దీంతో 35 ఓవర్లకు 271/4 పరుగులతో నిలిచింది. ఆ తర్వాత మిడిల్‌ఆర్డర్‌, టెయిలెండర్లు అద్ఫుత ప్రదర్శన చేయడంతో 38.2 ఓవర్లకే భారత్ విజయం సాధించింది.

పైనల్లో పాకిస్థాన్‌పై విజయం సాధించి వరుసగా రెండోసారి అంధుల వరల్డ్ కప్‌ని సొంతం చేసుకున్న టీమిండియాను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ట్విట్టర్‌లో అభినందించారు.

Story first published: Saturday, January 20, 2018, 20:33 [IST]
Other articles published on Jan 20, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+