For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత క్రికెట్ జట్టుతో లంక మళ్లీ ఓడింది

Blind Cricket World Cup: Deepak Malik fires India to big win against Sri Lanka

హైదరాబాద్: భారత్‌లో క్రికెట్‌కు ఆదరణ అన్ని క్రీడల కంటే ఎక్కువగా ఉంటుందనే విషయం వేరే చెప్పకర్లేదు. కానీ, అంధుల క్రికెట్ విషయంలో కొంచెం తక్కువగానే ఉన్నట్లుంది. పాకిస్థాన్ గడ్డపై అంధుల ప్రపంచ కప్‌లో భాగంగా క్రికెట్ ఆడాల్సి ఉంది. ఈ క్రమంలో జట్టును అక్కడికి పంపేందుకు బీసీసీఐ జాప్యం చేసిన సంగతి తెలిసిందే.

అయితే అన్ని అవరోధాలు దాటుకుని వెళ్లిన భారత సేన తన ఖాతాలో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. బుధవారం లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 40 ఓవర్లలో 8 వికెట్లకు 358 పరుగుల భారీ స్కోరు సాధించింది.

సురంగ సంపత్‌ (68), కేఏ సిల్వా (64) రాణించారు. సునీల్‌ రమేష్‌ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారత్‌ 32 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది.

'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' దీపక్‌ 179 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రకాష్‌ జయరామయ్య (76) కూడా రాణించాడు. భారత్‌ శుక్రవారం తన తర్వాతి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఢీకొనబోతోంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, January 11, 2018, 9:49 [IST]
Other articles published on Jan 11, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+