
హైదరాబాద్: హ్యామిల్టన్‌లోని సెడన్ పార్క్‌లో రెండో టెస్టు సందర్భంగా వెస్టిండీస్‌తో న్యూజిలాండ్ తలపడింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్ట్ ఇండీస్ టాస్ గెలుచుకుని బౌలింగ్‌ను ఎంచుకుంది. మొదటిగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ అవకాశాన్ని అంతగా సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఒక దశలో కివీస్ 154/1 స్కోరుతో మెరుగుగా అనిపించింది.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. బ్లండెల్ (12), వాగ్నర్ (1) క్రీజులో ఉన్నారు. కివీస్‌కు ఓపెనర్ జీత్ రావల్ (84; 157 బంతుల్లో 15×4) శుభారంభాన్ని అందించాడు.మరో ఓపెనర్ లేథమ్ (22)తో కలిసి తొలి వికెట్‌కు 65 పరుగులు జోడించిన అతడు.. రెండో వికెట్‌కు కేన్ విలియమ్సన్ (43)తో కలిసి 89 పరుగులు జతచేశాడు.
ఐతే భోజన విరామం తర్వాత పేసర్లు గాబ్రియల్ (3/79), కమిన్స్ (2/37) విజృంభించి బౌలింగ్ చేయడంతో న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. 35 పరుగుల తేడాలో 4 వికెట్లు కోల్పోయింది. గ్రాండ్‌హోమ్ (58), శాంట్నర్ (24) ఆదుకోకుంటే కివీస్ మరింత ఇబ్బందుల్లో పడేది.
న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 102.2 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 373 స్కోరు సాధించి ఆధిక్యంలో ఉంది. వెస్టీండీస్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు 41.5 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 149పరుగులు చేసింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.