For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వెల్లింగ్టన్ టెస్టులో చెత్త రికార్డుని మూటకట్టుకున్న బంగ్లాదేశ్

వెల్లింగ్టన్ జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 66/3 ఓవర్ నైట్ స్కోరుతో చివరిరోజు ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ 160 పరుగులకే ఆలౌటైంది.

By Nageshwara Rao

హైదరాబాద్: వెల్లింగ్టన్ జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 66/3 ఓవర్ నైట్ స్కోరుతో చివరిరోజు ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ 160 పరుగులకే ఆలౌటైంది. దీంతో న్యూజిలాండ్‌కు 217 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

అనతంరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన న్యూజిలాండ్ 3 వికెట్లను కోల్పోయి 39.4 ఓవర్లలో నిర్దేశిత లక్ష్యాన్ని ఎటువంటి తడబాటు లేకుండా అందుకుంది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (104 నాటౌట్), రాస్ టేలర్(60)లు రాణించి జట్టు విజయంలో పాలు పంచుకున్నారు.

తొలి టెస్టులో అపశృతి: బంతి తగిలి కుప్పకూలిన బంగ్లా కెప్టెన్

రెండో ఇన్నింగ్స్‌లో 90 బంతులను ఎదుర్కొన్న విలియమ్సన్ 15 ఫోర్ల సాయంతో సెంచరీని నమోదు చేశాడు. ఇది విలియమ్సన్‌కు 15వ టెస్టు సెంచరీ కావడం విశేషం. ఇదిలా ఉంటే వెల్లింగ్టన్ టెస్టులో పలు కొత్త రికార్డులు నమోదయ్యాయి. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 595 పరుగులు చేసింది.

Black Caps seal stunning come-from-behind win

తద్వారా ఆతిథ్య దేశమైన న్యూజిలాండ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో మొట్టమొదటిసారి అత్యధిక పరుగు నమోదు చేసిన రికార్డుని నెలకొల్పింది. అయితే ఈ రికార్డుని సాధించిన ఒక్క రోజు వ్యవధిలోనే బంగ్లాదేశ్ మరో చెత్త రికార్డుని మూటగట్టుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ పరుగులు చేసిన బంగ్లా ఈ టెస్టులో ఓటమిపాలైంది.

అయితే ఈ ఓటమి కూడా రికార్డు స్ధాయి ఓటమి కావడంతో ఓ చెత్త రికార్డుని సృష్టించింది. 1894-95లో ఇంగ్లాండ్‌తో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 586 భారీ పరుగులు చేసి మ్యాచ్‌ను ఓటమితో ముగించింది. ఇదే ఇప్పటివరకు తొలి ఇన్నింగ్స్ అత్యధిక పరుగులు చేసిన మ్యాచ్‌లో ఓటమి పాలైన రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉంది.

తాజాగా వెల్లింగ్టన్ టెస్టులో న్యూజిలాండ్ చేతిలో బంగ్లాదేశ్ ఏడు వికెట్లు తేడాతో ఓటమిపాలవడంతో ఇన్నాళ్లకు ఆస్ట్రేలియా రికార్డుని తిరిగరాసింది. వెల్లింగ్టన్‌లో జరిగిన తొలి టెస్టు తొలుతు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 595/8వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇక న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 539 పరుగులకు ఆలౌటైంది.

దీంతో తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌కు 59 పరుగుల ఆధిక్యం లభించింది. 66/3 ఓవర్ నైట్ స్కోరుతో చివరిరోజు ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ 160 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్‌కు 217 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. 217 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 39.4 ఓవర్లలో నిర్దేశిత లక్ష్యాన్ని అందుకుంది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+