న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫిట్‌నెస్ సాధించిన విలియమ్సన్: శుక్రవారం జట్టుతో చేరనున్న కెప్టెన్

Black Caps captain Kane Williamson a week away from returning from injury in the IPL

హైదరాబాద్: మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2019 సీజన్‌కి తెరలేవనుంది. ఈ సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ అభిమానులకు నిజంగా ఇది శుభవార్తే. ఇటీవల బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్ ఆడుతూ గాయపడిన కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్ సాధించిన కేన్ విలియమ్సన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరబోతున్నాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా.. విలియమ్సన్ భుజానికి గాయామైంది. దీంతో కనీసం బ్యాటింగ్‌ కూడా సరిగా చేయలేకపోయాడు. వైద్యులు ఆసుపత్రిలో చేరమని సలహా ఇవ్వడంతో చికిత్స తీసుకున్నాడు. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న విలియమ్సన్‌.. ప్రస్తుతం పూర్తిగా ఫిట్‌నెస్ సాధించాడని శుక్రవారమే అతను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరబోతున్నట్లు ఫ్రాంఛైజీ ప్రకటించింది.

గత సీజన్‌లో బాల్ టాంపరింగ్ ఉదంతంతో నిషేధానికి గురైన డేవిడ్ వార్నర్ స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పగ్గాలు అందుకున్న కేన్ విలియమ్సన్ బ్యాట్స్‌మెన్‌గా, కెప్టెన్‌గా అత్యుత్తమ ప్రదర్శనతో జట్టుని ఫైనల్‌కి చేర్చాడు. అయితే, తిరిగి మళ్లీ వార్నర్ జట్టులో చేరినప్పటికీ... విలియమ్సన్‌కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేందుకు సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ మొగ్గు చూపింది.

దీంతో డేవిడ్ వార్నర్ ఓపెనర్‌గా మాత్రమే జట్టులో కొనసాగనున్నాడు. మార్చి 23 నుంచి ఐపీఎల్ మొదలవుతుండగా.. 24వ తేదీ సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఈడెన్‌ గార్డెన్స్ వేదికగా తలపడనుంది. ఇందులో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటికే కోల్‌కతాకు చేరుకుంది.

Story first published: Friday, March 22, 2019, 16:53 [IST]
Other articles published on Mar 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X