బీసీసీఐపై గుస్సా.. డీడీసీఏ ప్రెసిడెంట్‌ను సస్పెండ్ చేయాలన్న బీజేపీ లీడర్

భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు నిర్వహించిన ఢిల్లీ.. మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి అంత మంచి విషయంలో కాదు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన రోహన్ జైట్లీపై ఒక మహిళ సంచలన ఆరోపణలు చేసింది. తనను రోహన్ మోసం చేశాడని,
మాయమాటలు చెప్పి లైంగిక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది. దీంతో ఒక్కసారిగా దుమారం రేగింది. ఈ క్రమంలోనే బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యన్ స్వామి కూడా ఈ విషయంపై స్పందించడం గమనార్హం.

బీసీసీఐకి ఫిర్యాదు..
సదరు మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ బీసీసీఐ పాలక వర్గం అయిన రోజర్ బిన్నీ, జై షా తదితరులకు ఫిర్యాదు చేసింది. తనతో చాలా కాలంగా శారీరక సంబంధం పెట్టుకున్న రోహన్.. తనను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడని ఆమె తెలిపింది. భార్యకు విడాకులిచ్చి తనను వివాహం చేసుకుంటానని రోహన్ చెప్పాడని, తను ఆ మాటలు నమ్మానని చెప్పింది. కానీ ఎంత కాలానికీ రోహన్ తనను పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదని, దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడిపోయానని ఆవేదన చెందింది.

బెదిరింపులకు దిగిన్ రోహన్..
ఈ క్రమంలోనే ఒకసారి రోహన్, తను కలిసి కపుల్స్ థెరపీ కూడా తీసుకున్నట్లు ఆమె వెల్లడించింది. డీడీసీఏలోని సైకాలజిస్టు వద్దకు రోహన్ తనను తీసుకెళ్లాడని చెప్పింది. సాధారణంగా డీడీసీఏ సైకాలజిస్టు దగ్గరకు వెళ్లకూడదని, కానీ రోహన్ తన అధికారాన్ని ఇలా దుర్వినియోగం చేసుకున్నాడని ఆరోపించింది. ఆ తర్వాత రోహన్ తరఫున కొందరు తనను బెదిరించారని కూడా తెలిపింది. 'రోహన్, అతని కుటుంబం నాకు డబ్బులిచ్చి వదులించుకోవాలని చూసింది. కానీ నాకు డబ్బు అక్కర్లేదు న్యాయం కావాలని అడిగా. దీంతో నా జీవితాన్ని నాశనం చేసేస్తామని, పరువు తీస్తామని బెదిరించారు' అని ఆమె చెప్పుకొచ్చింది.
సుబ్రమణ్యన్ స్వామి డిమాండ్..
ఈ విషయంపై స్పందించిన సుబ్రమణ్యన్ స్వామి.. ఈ కేసులో రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ వేయాలని బీసీసీఐకి సూచించాడు. ఈ కమిటీ విచారణ పూర్తయ్యే వరకూ రోహన్ తన పదవిలో ఉండకూడదని, అతన్ని వెంటనే బీసీసీఐ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాడు. 'సదరు మహిళ వేసిన సెక్సువల్ ఇన్వాల్వ్‌మెంట్ కేసుపై రిటైర్డ్ జడ్జితో బీసీసీఐ విచారణ జరిపించాలి. ఈ దర్యాప్తు ముగిసి, రోహన్ జైట్లీకి క్లీన్ చిట్ వచ్చే వరకు అతన్ని బీసీసీఐ సస్పెండ్ చేయాలి' అని సుబ్రమణ్యన్ స్వామి ట్వీట్ చేశారు. దీనికి నెటిజన్లు కూడా మద్దతు ఇస్తున్నారు. ఇలాంటి దారుణాలను సహించకూడదని అంటున్నారు. మరి బీసీసీఐ ఈ విషయంలో ఏం చేస్తుందో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications