లైవ్‌లో లయన్ నిక్కరు లాగేసిన స్టార్క్(వీడియో)


న్యూ ఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ అవుట్ కాకపోయినా.. అవుట్ ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయం అటుంచితే ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టులో జరిగిన ఓ సరదా సన్నివేశం ఇప్పుడు వైరల్‌గా మారి అందరికీ నవ్వు తెప్పిస్తోంది. ఆటలో మూడో రోజైన ఆదివారం మరికొద్దిసేపట్లో మ్యాచ్ మొదలవుతుందనగా.. పిచ్ స్పందిస్తున్న తీరుపై ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ 'లైవ్'లో మాట్లాడాడు.
ఆ సమయంలో ఆటగాళ్లంతా రన్నింగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. వారిలో నుంచి ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్.. అనూహ్యంగా వచ్చి లయన్ వేసుకున్న నిక్కరు మోకాళ్ల వరకూ లాగేసి వెళ్లిపోయాడు. పాపం! అప్పటికే సహచరుడి చర్యను సర్ది చెప్పుకునేలా సరదాగా తీసుకుని ఏమీ ఎరుగనట్లు మళ్లీ షార్ట్‌ని పైకిలాగేసుకుని తన మాటల్ని కొనసాగించాడు లయన్. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 326 పరుగులకి ఆలౌటవగా.. అనంతరం భారత్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఈరోజు 283 పరుగులకే పరిమితమైంది. స్పిన్నర్ నాథన్ లయన్ 67 పరుగులిచ్చి ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. అజింక్య రహానె (51), రిషబ్ పంత్ (36), మహ్మద్ షమీ (0), ఇషాంత్ శర్మ (1), జస్‌ప్రీత్ బుమ్రా (4) రూపంలో ఐదు వికెట్లనీ ఈరోజే లయన్ పడగొట్టడం విశేషం.
మూడోరోజు, ఆదివారం ఆట ముగిసే సరికి కంగారూ జట్టు 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. ఆధిక్యంతో కలుపుకొని 175తో ఉంది. ఆసీస్ 200 కన్నా ఎక్కువ లక్ష్యం నిర్దేశిస్తే కోహ్లీ సేనకు చాలా కష్టం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications