For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓపెనర్ 160, 8 డకౌట్లు: క్రికెట్ చరిత్రలోనే వింత స్కోరు

క్రికెట్ ప్రపంచంలోనే ఆశ్చర్యకరమైన వింత స్కోరు కార్డు దక్షిణాఫ్రికాలో నమోదైంది. ఓపెనర్ ఒక్కడే 160 పరుగులు చేయగా జట్టులోని మిగతా ఆటగాళ్లంతా డకౌట్‌గా పెవిలియన్‌కు చేరారు. 

By Nageshwara Rao

హైదరాబాద్: క్రికెట్ ప్రపంచంలోనే ఆశ్చర్యకరమైన వింత స్కోరు కార్డు దక్షిణాఫ్రికాలో నమోదైంది. ఓపెనర్ ఒక్కడే 160 పరుగులు చేయగా జట్టులోని మిగతా ఆటగాళ్లంతా డకౌట్‌గా పెవిలియన్‌కు చేరారు. వివరాల్లోకి వెళితే దక్షిణాఫ్రికాలోని పిట్రోడాలో జరిగిన అండర్ 19 బాలికల నేషనల్ టోర్నమెంట్ ఇందుకు వేదికగా నిలిచింది.

సోమవారం (డిసెంబర్ 12)న పిట్రోడాలోని బలోయి క్రికెట్ గ్రౌండ్‌లో ముమలాంగా, ఈస్ట్రన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముమలాంగా జట్టు ఓపెనర్ షానియా-లీ స్వార్ట్ 86 బంతుల్లో 18 ఫోర్లు, 12 సిక్సులతో 160 పరుగులు సాధించి ఔరా అనిపించింది.

Bizarre scorecard: A big ton of 160, 8 ducks from one winning team

బ్యాటింగ్‌కు దిగిన మిగితా ఆటగాళ్లు 8 మంది డకౌట్‌గా వెనుదిరిగినా కేవలం 86 బంతుల్లోనే ఆమె ఈ ఘనత సాధించింది. ఈ స్కోరు కార్డు క్రీడా విశ్లేషకులను విస్మయానికి గురి చేసింది. అంతేకాదు జట్టులోకి మిగతా ఆటగాళ్లంతా డకౌట్లుగా వెనుదిరిగిన నిలకడగా ఆడతూ సెంచరీని పూర్తి చేసిన ఓపెనర్ షానియా-లీ స్వార్ట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈస్ట్రన్స్ తో జరిగిన ఈ మ్యాచ్‌లో ముమలాంగా జట్టు 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముమలాంగా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఓపెనర్ షానియా-లీ స్వార్ట్‌ ఒక్కడే 160 పరుగులు చేయగా, మిగతా 9 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి.

161 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్ట్రన్స్ జట్టు 20 ఓవర్లకు గాను 6 వికెట్లు నష్టపోయి 127 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో రాణించిన షానియా-లీ స్వార్ట్‌ 4 ఓవర్లు వేసి రెండు వికెట్లు తీసుకుని 21 పరుగులిచ్చాడు.

ఈస్ట్రన్స్ జట్టు ఓపెనర్ గార్మెన్ నాగిల్ చేసిన 63 పరుగులే ఆ జట్టు ఆటగాళ్లలో అత్యధిక స్కోరు. అయితే ఈస్ట్రన్స్ జట్టులో ఒకే ఒక్క క్రీడాకారిణి మొహషాన్నీ షాబిలీ డకౌట్ అయింది. దీంతో మొత్తంగా ఈ మ్యాచ్‌లో 9 మంది డకౌట్‌గా పెవిలియన్‌కు చేరారు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+