న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కంగారుపడి ఫీల్డర్‌కి బాల్ వేసిన రబాడ(వీడియో)

Bizarre! Kagiso Rabada left embarrassed after bowling a shocker to Glenn Maxwell, watch video

హైదరాబాద్: ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికాల మధ్య క్వీన్స్‌లాండ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఎంగిడి వేసిన బంతిని ఏమని నిర్ధారించాలో అర్థంకాక అంపైర్లు సైతం కాసేపు తికమకపడ్డారు. క్రికెట్‌లో బౌలర్ చేజారి బంతి నేరుగా వికెట్ కీపర్ దగ్గరికో లేదా స్లిప్ ఫీల్డర్ దగ్గరికో వెళ్లడం చూస్తుంటాం. ఇంకొన్ని సార్లు బంతి బీమర్‌గా మారడంతో అంపైర్ల హెచ్చరికలను కూడా బౌలర్లు అందుకుంటారు.

 జట్టు సహచరులను సైతం ఆశ్చర్యంలో

జట్టు సహచరులను సైతం ఆశ్చర్యంలో

కానీ సౌతాఫ్రికా బౌలర్ కగిసో రబాడా వేసి బాల్‌ను ఏమనాలో తెలియక అంపైర్లు కూడా కాసేపు చర్చించుకున్నారు. చివరికి దానిని డెడ్ బాల్‌గా ప్రకటించారు. ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో ఈ అరుదైన ఘటన జరిగింది. సాధారణంగా కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను ఆశ్చర్యపరిచే రబాడా.. ఈసారి ఎవరూ ఊహించని బంతితో తన జట్టు సహచరులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

బాల్ వేయబోతుండగా.. ఏకంగా పాయింట్ ఫీల్డర్

అంతేకాదు అసలేం జరిగిందో తనకే తెలియక బిక్కమొహం వేశాడు. బాల్ వేయబోతుండగా.. అది చేజారి ఏకంగా పాయింట్ ఫీల్డర్ దగ్గరకు వెళ్లడం విశేషం. దీంతో ఫీల్డ్ అంపైర్లు ఇద్దరూ కాసేపు మాట్లాడుకొని దానిని డెడ్‌బాల్‌గా ప్రకటించారు. వర్షం కారణంగా 10 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో 21 పరుగులతో గెలిచిన సౌతాఫ్రికా 1-0తో టీ20 సిరీస్‌ను గెలిచింది.

దూకుడుగా ఆడిన దక్షిణాఫ్రికా:

దూకుడుగా ఆడిన దక్షిణాఫ్రికా:

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టులో ఓపెనర్లు డికాక్ (22: 16 బంతుల్లో 2సిక్సులు), హెండ్రిక్స్ (19: 8 బంతుల్లో 3ఫోర్లు, ఒక సిక్సు) తొలి వికెట్‌కి 2.5 ఓవర్లలోనే 42 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభమివ్వగా.. అనంతరం వచ్చిన కెప్టెన్ డుప్లెసిస్ (27: 15 బంతుల్లో 4ఫోర్లు), హెన్రిచ్ క్లాసెన్ (12), డేవిడ్ మిల్లర్ (11) దూకుడుగా ఆడాడు.

10 ఓవర్లలో 87/7తో పరాజయం పాలై

10 ఓవర్లలో 87/7తో పరాజయం పాలై

వర్షం కారణంగా కుదించిన 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియాకి ఆరంభంలోనే ఆటంకాలు ఎదురైయ్యాయి. కెప్టెన్ అరోన్ ఫించ్ (7), హిట్టర్ క్రిస్‌లిన్ (14), డీఆర్క్ షార్ట్ (0) వరుస ఓవర్లలో తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరిపోయారు. ఈ దశలో గ్లెన్ మాక్స్‌వెల్ (38: 23 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సులు) దూకుడుగా ఆడుతూ ఆ జట్టుని గెలిపించే ప్రయత్నం చేసినా.. అతనికి సహకరించే వారు కరువైయ్యారు. ఆ జట్టు చివరికి 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 87 పరుగులే చేయగలిగింది.

Story first published: Sunday, November 18, 2018, 15:40 [IST]
Other articles published on Nov 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X