Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'రౌడీ ప్రవర్తనను క్షమించరాదు.. అతన్ని కెప్టెన్‌గా తొలగించాలి'

Bishan Singh Bedi Slams Shubman Gill's Behaviour During Ranji Match ! || Oneindia Telugu
Bishan Singh Bedi Slams Shubman Gill, Says Rowdy Behaviour Unpardonable

ఢీల్లీ: భారత-ఏ జట్టు కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్‌ది రౌడీ ప్రవర్తన అని టీమిండియా మాజీ క్రికెటర్‌ బిషన్‌ బేడీ అభిప్రాయపడ్డారు. రౌడీ ప్రవర్తన కలిగిన ఏ క్రికెటర్‌ని క్షమించరాదు. మ్యాచ్‌ రిఫరీ ఫిర్యాదు చేయకముందే గిల్‌ను భారత-ఏ కెప్టెన్‌గా తొలగించాలి అని బేడీ సూచించారు. మొహాలిలో పంజాబ్‌, ఢిల్లీ జట్ల మధ్య శుక్రవారం జరిగిన రంజీ మ్యాచ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌ను దూషించడంతో అసహనం వ్యక్తం చేసిన బేడీ పైవిధంగా స్పందించారు.

 కెప్టెన్‌గా తొలగించాలి:

కెప్టెన్‌గా తొలగించాలి:

తాజాగా ట్విటర్‌లో ఓ విలేకరి శుభ్‌మన్‌ విషయమై స్పందించాలని బిషన్‌ బేడీని కోరాడు. 'భారత-ఏ జట్టుకు కెప్టెన్‌గా ఉండి ఇలాంటి రౌడీ ప్రవర్తన కలిగిన ఏ క్రికెటర్‌ని క్షమించరాదు. ఎంత టాలెంట్‌ ఉన్న ఆటగాడైనా.. ఆట కంటే ఎక్కువ కాదు. మ్యాచ్‌ రిఫరీ ఫిర్యాదు చేయకముందే గిల్‌ను కెప్టెన్‌గా తొలగించాలి. అతని స్థానంలో సరైన ఆటగాడిని ఎంపిక చేసి హెచ్చరిక చేయాలి' అని బిషన్‌ బేడీ అన్నారు.

లెవెల్‌ 1 కింద చర్యలు

లెవెల్‌ 1 కింద చర్యలు

శుభ్‌మన్‌ గిల్‌ ఇటీవలే న్యూజిలాండ్‌ సిరీస్‌కు భారత-ఏ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌తో వివాదం విషయంలో మ్యాచ్‌ రిఫరీ శుభ్‌మన్‌తో మాట్లాడే అవకాశం ఉంది. ఒకవేళ అతడి నేరం రుజువైతే.. ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన లెవెల్‌ 1 కింద చర్యలు తీసుకుంటారు. హెచ్చరికతో కూడా పంజాబ్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ను వదిలేసే అవకాశం ఉంది. మ్యాచ్ రిఫరీ నిర్ణయం ఏదైనా.. నాలుగవ రోజు ఆట తరువాత మాత్రమే ప్రకటించబడుతుంది.

అంపైర్‌ తప్పుడు నిర్ణయం

అంపైర్‌ తప్పుడు నిర్ణయం

శుక్రవారం ప్రారంభమైన రంజీ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లు సాన్విర్‌ సింగ్‌- శుభమాన్ గిల్‌లు ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. సాన్విర్‌ సింగ్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరడంతో.. గుర్‌క్రీత్‌ సింగ్‌ మన్‌తో కలిసి గిల్ ఇన్నింగ్స్‌ను నిర్మిస్తున్నాడు. ఢిల్లీ బౌలర్‌ సిమర్‌ జీత్‌ సింగ్‌ వేసిన 14 ఓవర్‌ తొలి బంతిని గిల్ ఎదుర్కొన్నాడు. అయితే, అది బ్యాట్‌కు తగలకుండానే వెళ్లి వికెట్ కీపర్ అనుజ్‌ రావత్‌ చేతిల్లో పడింది. ఢిల్లీ ఆటగాళ్లు అప్పీల్‌ చేయగా అంపైర్‌ పఠాక్‌ ఔట్‌గా ఇచ్చాడు.

అంఫైర్‌ను దుర్బాషలాడిన గిల్‌

అంఫైర్‌ను దుర్బాషలాడిన గిల్‌

అయితే ఔట్‌ కాదనే విషయం గిల్‌కు స్పష్టంగా తెలియడంతో తాను క్రీజ్‌ను వదిలి వెళ్లే ప్రసక్తే లేదని పట్టుపట్టాడు. ఔట్‌ కాదని టీవీ రిప్లేలో తేలడంతో.. గిల్‌కు మరింత కోపం వచ్చింది. దీంతో అంఫైర్‌ను దుర్బాషలాడాడు. చివరకు మ్యాచ్‌ రిఫరీ కలగజేసుకుని గిల్‌కు సర్ధి చెప్పాడు.

Story first published: Sunday, January 5, 2020, 17:15 [IST]
Other articles published on Jan 5, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+