టైగ‌ర్ ప‌టౌడీని గుర్తుచేశాడు.. ర‌హానేకే టెస్ట్ కెప్టెన్సీ ఇవ్వాలి!! కోహ్లీ ఇక వద్దు!

ముంబై: ఆస్ట్రేలియాపై టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించడంతో జట్టు సారథ్య బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. కోహ్లీ గైర్హాజరీలో అజింక్య రహానే నేతృత్వంలోని యువ భారత్ అదరగొట్టింది. పటిష్ట ఆసీస్‌ను వారి సొంతగడ్డపై మట్టికరిపించింది. అడిలైడ్ వంటి ఘోర పరాజయం నుంచి తేరుకొని.. ఏకంగా 2-1తో సిరీస్ గెలుచుకుంది. పెటర్నిటీ లీవ్ మీద ఆస్ట్రేలియా పర్యటన నుంచి కోహ్లీ ఇండియాకు తిరిగిరాగా.. సిరీస్‌లో భారత్ రాణించడం కష్టమేనని దిగ్గజ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. గెలుపు దేవుడెరుగు.. గట్టి పోటీ ఇస్తే చాలని హేళన చేశారు. కానీ రహానే తన సారథ్యంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిచూపించాడు.

సెల‌క్ట‌ర్లు ధైర్యం చేయ‌లేరు

సెల‌క్ట‌ర్లు ధైర్యం చేయ‌లేరు

ఆస్ట్రేలియాలో చారిత్ర‌క విజ‌యం సాధించిన త‌ర్వాత అజింక్య ర‌హానేకు కెప్టెన్సీ ఇవ్వాల‌న్న డిమాండ్లు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా టీమిండియా మాజీ లెఫ్టామ్ స్పిన్న‌ర్ బిష‌న్ సింగ్ బేడీ కూడా ర‌హానేకే టెస్ట్ కెప్టెన్సీ ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు. ఇండియ‌న్ టీమ్‌కు విరాట్ కోహ్లీలోని ఓ సాదాసీదా కెప్టెన్ కావాలా లేక గ్రేట్ బ్యాట్స్‌మ‌న్ కావాలో తేల్చుకోవాల‌న్నాడు. టెస్టుల్లో ర‌హానే.. వ‌న్డేలు, టీ20ల‌కు కోహ్లీ, రోహిత్‌లు కెప్టెన్సీలు చేప‌డితే బాగుంటుంద‌న్నాడు. అయితే బీసీసీఐ సెల‌క్ట‌ర్లు ఈ ధైర్యం చేయ‌లేర‌న్నాడు.

ప‌టౌడీ కెప్టెన్సీయే గుర్తుకు వస్తుంది

ప‌టౌడీ కెప్టెన్సీయే గుర్తుకు వస్తుంది

'ఆస్ట్రేలియాలో అజింక్య ర‌హానే కెప్టెన్సీ చూసి అత‌నికి పెద్ద అభిమానిని అయిపోయా. త‌న చుట్టూ ఓ గాయ‌ప‌డిన టీమ్‌ను ముందుండి న‌డిపించిన తీరు అద్భుతం. అందుబాటులో ఉన్న బౌలింగ్ వ‌న‌రుల‌ను వాడుకున్న తీరు అమోఘం. ర‌హానేను చూస్తుంటే త‌న‌కు టైగ‌ర్ ప‌టౌడీ కెప్టెన్సీయే గుర్తుకు వస్తుంది. పటౌడీ సారథ్యం చేసిన స‌మ‌యంలో త‌గిన వ‌న‌రులు లేక‌పోయినా.. త‌న కెప్టెన్సీతో టీమ్‌ను విజ‌యాల బాట ప‌ట్టించాడు. ఇప్పుడు ర‌హానే కూడా అదే ప‌ని చేస్తున్నాడు' అని బిష‌న్ సింగ్ బేడీ పేర్కొన్నాడు.

ఒక్క తప్పిదం కనిపించడం లేదు

ఒక్క తప్పిదం కనిపించడం లేదు

'నేను ఈ పర్యటనలో అజింక్య రహానేను చాలా దగ్గరగా గమనించాను. బౌలింగ్ వ‌న‌రుల‌ను వాడుకోవ‌డంలోనే ఓ కెప్టెన్ సామ‌ర్థ్యం ఏంటో తెలుస్తుంది. ఆ విష‌యంలో ర‌హానే పూర్తిగా విజ‌య‌వంత‌మ‌య్యాడు. "కెప్టెన్సీ అంటే 90 శాతం ల‌క్‌.. ప‌ది శాతం నైపుణ్యం. కానీ ఆ ప‌ది శాతం నైపుణ్యం లేక‌పోతే మాత్రం దానిని ప్ర‌య‌త్నించ‌వ‌ద్ద‌ని రిచీ బెనాడ్ చెప్పారు". ర‌హానే విష‌యంలో మాత్రం 50 శాతం ల‌క్‌, 50 శాతం నైపుణ్యం ఉంది. రహానే సామర్ధ్యాన్ని అంచనా వేయడానికి ఈ మూడు టెస్టులు చాలు. నా లాంటి వారు అతడి సారథ్యంను వేలెత్తిచూపడానికి ఒక్క తప్పిదం కనిపించడం లేదు' అని బేడీ అన్నాడు.

వ‌న్డేలు, టీ20ల‌కు కోహ్లీ, రోహిత్

వ‌న్డేలు, టీ20ల‌కు కోహ్లీ, రోహిత్

'రవిచంద్రన్ అశ్విన్ తన ప్రదర్శనతో అంత సులభంగా సంతృప్తి చెందడు. కానీ అతను ఈ పర్యటనలో బిన్నంగా కనిపించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని నటరాజన్‌కు ఇవ్వడం రహానే గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ఇక విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కెరీర్ ఎక్కువ కాలం కొన‌సాగాలంటే.. కెప్టెన్సీని ర‌హానేకు అప్ప‌గించాలి. ఇండియ‌న్ టీమ్‌కు కోహ్లీలోని ఓ సాదాసీదా కెప్టెన్ కావాలా లేక గ్రేట్ బ్యాట్స్‌మ‌న్ కావాలో తేల్చుకోవాలి. టెస్టుల్లో ర‌హానే.. వ‌న్డేలు, టీ20ల‌కు కోహ్లీ, రోహిత్‌లు కెప్టెన్సీలు చేప‌డితే బాగుంటుందని నా అభిప్రాయం' అని మాజీ లెఫ్టామ్ స్పిన్న‌ర్ బేడీ చెప్పుకొచ్చాడు.

ఆస్ట్రేలియా పనైపాయే .. ఇకపై టీమిండియాను ఓడించడంపై దృష్టిపెట్టండి: ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్‌‌

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Friday, January 22, 2021, 14:27 [IST]
Other articles published on Jan 22, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X