Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అభిమాని vs క్రికెటర్: పాకిస్థాన్‌కి రా మంచి బిర్యానీ పెడతాం.. అబ్బో చాలా దూరం కదా!!

Jimmy Neesham Gives Stunning Reply To Pak Fan’s Biryani Invitation || Oneindia Telugu
Biryani invitation: New Zealand all rounder Jimmy Neesham gives super reply to Pakistan fan

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కి రా మంచి బిర్యానీ పెడతాం అని ఓ అభిమాని కోరగా.. అబ్బో పాక్ చాలా దూరం కదా అని క్రికెటర్ సమాధానం ఇచ్చాడు. ఇంతకు ఎవరా క్రికెటర్ అనుకుంటున్నారా?. అతను మరెవరో కాదు.. సోషల్ మీడియాలో ఎప్పుడు చురుగ్గా ఉండే న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ జిమ్మీ నీషమ్‌. విషయంలోకి వెళితే.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

మంచి రెస్టారెంట్‌ ఉందా:

జిమ్మీ నీషమ్‌ ప్రస్తుతం కెనెడాలో గ్లోబల్‌ టీ20 లీగ్‌లో ఎడ్మొంటన్ రాయల్స్ జట్టు తరపున ఆడుతున్నాడు. ఈ సందర్భంగా.. మూడు రోజుల క్రితం తన ట్విట్టర్ ఫాలోయర్స్‌ను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్‌ చేశాడు. 'టొరంటో నగరంలో తినడానికి/తాగడానికి ఏదైనా మంచి రెస్టారెంట్‌ ఉంటే చెప్పండి. రూఫ్‌టాప్‌ బార్‌, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి' అని అభిమానులను అడిగాడు.

చాలా దూరం కదా:

ఈ ట్వీట్‌కు ఓ పాకిస్థాన్ అభిమాని రిప్లై ఇచ్చాడు. 'పాకిస్థాన్‌కి రండి. మీకు రుచికరమైన ఆహారం అందిస్తాం. ప్రపంచంలోనే పాకిస్తానీ బిర్యానీ అత్యుత్తమ వంటకం' అని అభిమాని ట్వీట్ చేసాడు. ఇది చూసిన జిమ్మీ నీషమ్‌.. అభిమానికి రిప్లై ఇచ్చాడు. 'ఈ రాత్రి సహచరుడికి విందు కోసం పాక్ వెళ్ళడానికి చాలా దూరం కదా' అని సమాధానం ఇచ్చాడు. నీషమ్‌ ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్ ముందు, ఓటమి తర్వాత కూడా ట్విటర్‌లో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

క్రికెట్ అభిమానులు మ్యాచ్‌కు వచ్చేలా చేయండి:

క్రికెట్ అభిమానులు మ్యాచ్‌కు వచ్చేలా చేయండి:

ఫైనల్ మ్యాచ్ ముందు.. 'ప్రియమైన భారత అభిమానులారా. ఒకవేళ ఫైనల్ మ్యాచ్‌ను వీరు వీక్షించేందుకు స్టేడియానికి రాలేకపోతే.. దయచేసి మీ వద్ద ఉన్న మ్యాచ్ టికెట్లను అధికారిక ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విక్రయించండి. అధిక లాభానికి అమ్ముకోవాలని అందరికీ అనిపిస్తుంది. కానీ.. ధనవంతులే కాకుండా నిజమైన క్రికెట్ అభిమానులు మ్యాచ్‌కు వచ్చేలా చేయండి' అని నీషమ్ ట్విట్టర్ ఖాతాలో రాసుకోచ్చాడు.

పిల్లలూ ఎవ్వరూ క్రీడల్లోకి రావొద్దు:

పిల్లలూ ఎవ్వరూ క్రీడల్లోకి రావొద్దు:

ఫైనల్ మ్యాచ్ అనంతరం జేమ్స్‌ నీషమ్ ట్వీటర్‌లో చేసిన ఓ పోస్ట్‌ పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. 'పిల్లలూ ఎవ్వరూ క్రీడల్లోకి రావొద్దు. మీరు వేరే ఎదైనా ప్రొఫెషన్ ఎంచుకోండి. 60 ఏళ్లకే హ్యాపీగా చనిపోండి' అంటూ జిమ్మీ పోస్ట్‌ చేశాడు. చెన్నై vs ముంబై జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్లో చోటు చేసుకున్న ధోనీ రనౌట్‌పై నీషమ్ ట్విట్టర్‌లో స్పందించాడు. 'అది కచ్చితంగా రనౌటే. థర్డ్‌ అంపైర్‌ నిర్ణయం నన్ను ఏమీ విస్మయానికి గురి చేయలేదు. కొందరు అభిమానులు క్రికెట్ అంటే ఇంత ప్యాషనేట్‌గా ఉండటం ఎంతగానో నచ్చింది. ధోని అంటే చాలా ఇష్టం. అయితే, అది నాటౌట్ అంటే ఆశ్చర్యంగా ఉంది' అంటూ ధోని రనౌట్ ఫోటోను ట్వీట్ చేశాడు.

Story first published: Thursday, August 1, 2019, 13:19 [IST]
Other articles published on Aug 1, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+