37వ పడిలోకి ధోని: ట్విట్టర్‌లో పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ


హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ శనివారం 37వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ధోనికి అభిమానులతో పాటు ప్రస్తుత మాజీ క్రికెటర్లు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ధోని పుట్టిన రోజును టీమిండియా క్రికెటర్లు ఘనంగా జరిపారు.
ఈసందర్భంగా పాండ్యా బ్రదర్స్ 'హ్యాపీ బర్త్‌డే మహీ' అంటూ పాడుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత క్రికెట్‌కు ధోని విశేష సేవలందించాడు. బీసీసీఐ అందించిన అత్యుత్తమ కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకడు.
ధోని తన కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అందుకున్నాడు. భారత క్రికెట్ జట్టు ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో పాలు పంచుకున్న ధోని.. భారత జట్టు తరపును 199 వన్డేలకు, 72 టీ20లకు, 60 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. వరల్డ్ కప్, వరల్డ్ టీ20, చాంపియన్స్ ట్రోఫీలను గెలిచిన ఏకైక కెప్టెన్‌గా ధోని నిలిచాడు.
ఐసీసీ
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 37వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఐసీసీ తన ట్విట్టర్‌లో ఇలా ట్వీట్ చేసింది.
బీసీసీఐ
"స్పెషల్ విషెస్ ఫర్ ఎ స్పెషల్ మ్యాన్" అంటూ మహేంద్ర సింగ్ ధోని 37వ పుట్టినరోజు సందర్భంగా బీసీసీఐ ట్వీట్ చేసింది.
వీరేంద్ర సెహ్వాగ్
‘ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీ జీవితం ఇప్పటి కంటే ఇంకా సంతోషంగా ఉండాలి. నీ స్టంపింగ్ కంటే జీవితంలో నువ్వు సాధించే విజయాలే వేగంగా ఉండాలి. ‘ఓం ఫినిషాయ నమహా!''
సురేశ్ రైనా
500 అంతర్జాతీయ మ్యాచ్‌ల ప్రయాణం. నీలాంటి లెజెండ్ పుట్టినందుకు భారతావని గర్విస్తోంది. హ్యాపీ బర్త్‌డే ధోనీ బ్రదర్. నువ్వేనాకు స్ఫూర్తి. అది ఎప్పటికీ అలాగే కొనసాగుతుంది. నీతో ఉన్న అన్ని సమయాలను నేనెప్పుడూ గుర్తు పెట్టుకుంటాను. నీలాగ ఎవ్వరూ ఉండలేరు మ్యాన్.
సాక్షి సింగ్ రావత్ (ధోనీ భార్య)
‘హ్యాపీ బర్త్ డే టూయూ! నువ్వెంత గొప్ప వ్యక్తివో చెప్పడానికి మాటలు సరిపోవు. గత పదేళ్లుగా నీ నుంచి నేనెంతో నేర్చుకుంటున్నాను. ఇదిలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతో ప్రేమతో నా జీవితాన్ని ఆనందమయం చేసిన నీకు ధన్యవాదాలు.'
సచిన్ టెండూల్కర్
"హ్యాపీ బర్త్‌డే ధోనీ. అలాగే 500 అంతర్జాతీయ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు. నవ్వు ఇలాగే ఎప్పుడూ ఆనందంగా ఉంటూ నీ చుట్టు ఉండేవారికి అనందాన్ని పంచాలని కోరుకుంటున్నాను" అని సచిన్ ట్వీట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications