For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాహుల్ ద్రవిడ్ బర్త్‌డే స్పెషల్: రికార్డులు, ప్రత్యేక మైలురాళ్లు

Birth Special: Rahul Dravid Celebrate 46th Birthday

హైదరాబాద్: క్రికెట్‌లో నిల‌క‌డ అంటే ఠక్కున గుర్తుకొస్తాడు. టెక్నిక్ విష‌యంలో అతడి ఆటను దిగ్గజ క్రికెటర్లే మెచ్చుకున్నారు. ఎంతోమందికి యువ క్రికెటర్లకు రోల్ మోడ‌ల్. జ‌ట్టు కోసం కెప్టెన్ బాధ్యతలు చేపట్టాడు. కీపర్ లేడంటే ఠక్కు కీపింగ్ బాధ్యతలు తీసుకుంటాడు. ఓపెనింగ్ లేదావన్‌డౌన్‌లో సేవలు కావాలన్నా.. మిడిలార్డర్‌లో వికెట్లకు గోడ కట్టాలన్నా అతడే గుర్తుకొస్తాడు.

వివాదాలకు ఎప్పుడూ దూరమే. ఆ వ్యక్తి మరెవరో కాదు రాహుల్ ద్రవిడ్. శుక్రవారం 46వ పుట్టినరోజు సందర్భంగా మిస్టర్ డిపెండబుల్, ది వాల్ ద్రవిడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. భారత క్రికెట్‌కు బీసీసీఐ అందించిన అత్యుత్తమ ఆటగాళ్లలో రాహుల్ ద్రవిడ్ ఒకరు. టీమిండియాకు 16 ఏళ్ల పాటు సేవలందించిన రాహుల్ ద్రవిడ్‌ను అభిమానులు ముద్దుగా ద వాల్, మిస్టర్ డిపెండ‌బుల్, కెప్టెన్ కూల్‌గా పిలుచుకుంటారు.

మరాఠీ ఫ్యామిలీలో జన్మించిన రాహుల్ ద్రవిడ్

మరాఠీ ఫ్యామిలీలో జన్మించిన రాహుల్ ద్రవిడ్

ఈ సందర్భంగా మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు ద్రవిడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక మరాఠీ ఫ్యామిలీలో ద్రవిడ్ జన్మించాడు. ద్రవిడ్ పుట్టిన తర్వాత అతని ఫ్యామిలీ ఇండోర్ నుంచి కర్నాటక రాజధాని బెంగళూరుకు వెళ్లిపోయింది. అతని తండ్రి జామ్ తయారుచేసే ఫ్యాక్టరీలో పనిచేసేవాడు.

చిన్నప్పుడు ద్రవిడ్‌ను అందరూ ‘జామీ' అని పిలిచేవారు

చిన్నప్పుడు ద్రవిడ్‌ను అందరూ ‘జామీ' అని పిలిచేవారు

దీంతో చిన్నప్పుడు ద్రవిడ్‌ను అందరూ ‘జామీ' అని పిలిచేవారు. అతని తల్లి ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. రాహుల్ స్కూలింగ్ బెంగళూరులోని సెయిట్ బాయిస్ హై స్కూలులో జరిగింది. ఆ తర్వాత సెయింట్ జోసెఫ్ కాలేజీలో కామర్స్‌లో పట్టా అందుకున్నాడు. రాహుల్ ఇంగ్లీష్, మరాఠీ, కన్నడ, హిందీ బాషల్లో ప్రావీణ్యం సంపాదించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో 24,208 ప‌రుగులు చేసిన ద్రవిడ్

అంతర్జాతీయ క్రికెట్‌లో 24,208 ప‌రుగులు చేసిన ద్రవిడ్

2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ద్రవిడ్ మొత్తం 24,208 ప‌రుగులు నమోదు చేశాడు. టెస్టుల్లో 13288 పరుగులు చేశాడు. అందులో 36 సెంచరీలు ఉన్నాయి. క్రికెట్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఆరో బ్యాట్స్‌మ‌న్‌గా రికార్డు నమోదు చేశాడు. ఇక వన్డేల్లో 86 అర్ధసెంచరీలు చేసిన ద్రవిడ్ 2003 నుంచి 2007 వరకు టీమ్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా చేపట్టాడు.

2003లో విజేతా పెండ్రేకర్‌ను వివాహం చేసుకున్న ద్రవిడ్

2003లో విజేతా పెండ్రేకర్‌ను వివాహం చేసుకున్న ద్రవిడ్

వన్డే ఫార్మాట్‌లో అత్య‌ధిక హాఫ్ సెంచ‌రీలు చేసిన‌వారిలో నాలుగోస్థానంలో ఉన్నాడు. 2003లో రాహుల్ నాగపూర్‌నకు చెందిన విజేతా పెండ్రేకర్‌ను వివాహం చేసుకున్నాడు. ద్రవిడ్‌కు ఇద్దరు కుమారులు. 2007 వరల్డ్ కప్ తొలి రౌండ్లోనే టీమిండియా ఇంటిదారి పట్టడంతో ఆ తర్వాత కెప్టెన్సీకి రాజీనామా చేసి ప్లేయర్‌గా కొనసాగాడు.

ప్రస్తుతం ఆండర్-19 జట్టు కోచ్‌గా

ప్రస్తుతం ఆండర్-19 జట్టు కోచ్‌గా

రిటైరైన తర్వాత టీమిండియా కోచ్ పదవితోపాటు కొన్ని కీలక బాధ్యతలు ఇవ్వడానికి బీసీసీఐ సిద్ధంగా ఉన్నా ద్రవిడ్ వాటిని స్వీకరించలేదు. ప్రస్తుతం ఇండియా ఏ, అండర్-19 జట్లకు కోచ్‌గా యువ క్రికెటర్లకు మెరుగులు దిద్దుతూ భారత క్రికెట్‌కు మార్గదర్శిగా నిలుస్తున్నాడు. గతేడాది అండర్ 19 ప్రపంచ కప్‌ను సునాయాసంగా కైవసం చేసుకున్నారు.

లార్డ్స్ మైదానంలో అరంగేట్రం

లార్డ్స్ మైదానంలో అరంగేట్రం

క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ మైదానంలో టెస్టు అరంగేట్రం చేసిన ద్రవిడ్.. తన అరంగేట్ర టెస్టులో రాహుల్ ద్రవిడ్ 95 పరుగులు చేశాడు. 2012 జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌తో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న 5వ భారత క్రికెటర్ ద్రావిడ్. అతడి కంటే ముందు బిషన్ సింగ్ బేడీ, సునీల్ గావస్కర్, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే మాత్రమే ఉన్నారు. క్రికెట్‌లో సేవలకుగానూ 2004లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్ అవార్డులు స్వీకరించాడు.

క్రికెట్ కెరీర్

క్రికెట్ కెరీర్

164 టెస్టుల్లో 36 శతకాలు, 63 అర్ధశతకాల సాయంతో 13,288 పరుగులు చేశాడు. 344 వన్డేల్లో 12 సెంచరీలు, 83 హాఫ్ సెంచరీల సాయంతో 10,889 పరుగులు సాధించాడు. ఓ టీ20 మ్యాచ్‌లో 31 పరుగులు సహా అంతర్జాతీయ క్రికెట్‌లో 24,208 పరుగులు చేశాడు.

ఐసీసీ టెస్టు, ఐసీసీ ప్లేయర్ అవార్డులు

ఐసీసీ టెస్టు, ఐసీసీ ప్లేయర్ అవార్డులు

2004లో ఐసీసీ ప్రకటించిన ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో పాటు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని రాహుల్ ద్రవిడ్ సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డు అందుకున్న తొలి భారత క్రికెట్ ద్రవిడ్.

Story first published: Friday, January 11, 2019, 12:05 [IST]
Other articles published on Jan 11, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+