అంపైరింగ్ లో ఆయనో ట్రెండ్ సెట్టర్.. : మిస్ అవనున్న క్రికెట్ ఫ్యాన్స్
వెల్లింగ్టన్ : అందరూ చేసే పనే అయినా.. అందరి దృష్టిని తమవైపుకు తిప్పుకునేలా చేసుకునేవారు కొంతమందే ఉంటారు. పనితనంలో వాళ్ల ప్రత్యేకత మిగతా వాళ్లకంటే వారిని భిన్నంగా ఫోకస్ చేయడమే ఇందుకు ప్రధాన కారణం. తదనుగుణంగానే ఆయా వ్యక్తులకు ఫాలోయింగ్ ఏర్పడుతుంది.
ఇవే వ్యాఖ్యలను క్రికెట్ అంపైరింగ్ కి అన్వయించుకుంటే.. క్రికెట్ చరిత్రలో ఎంతమంది అంపైర్లు ఉన్నా..! అంపైర్ బిల్లీ బౌడెన్ ప్రత్యేకంగా నిలిచిపోతారు. బ్యాట్స్ మెన్ సిక్స్ కొట్టినా.. ఫోర్ కొట్టినా.. ఆఖరికి అవుట్ అయినా.. ఆయనిచ్చే సంకేతాలు 'సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్' గా మారిపోతాయి. అందుకే అభిమానులు బౌడెన్ అంపైరింగ్ పట్ల ఆసక్తి కనబరుస్తారు.

అయితే.. బిల్లీ బౌడెన్ అంపైరింగ్ ని ఇష్టపడే క్రికెట్ అభిమానులకు మాత్రం ఇది మింగుడుపడని విషయమే. ఎందుకంటే, అంతర్జాతీయ క్రికెట్ లో ఇకపై బిల్లీ బౌడెన్ అంపైరింగ్ విన్యాసాలను చూసే అవకాశం దాదాపుగా ఉండకపోవచ్చు. బిల్లీ బౌడెన్ ని అంతర్జాతీయ అంపైరింగ్ ప్యానెల్ నుంచి తప్పిస్తూ న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం.
బిల్లీని కేవలం దేశవాళీ క్రికెట్ అంపైరింగ్ కే పరిమితం చేస్తూ.. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. కాగా ఇప్పటివరకు 84 టెస్టులు, 200 వన్డేలు, 24 టీ20 లకు అంతర్జాతీయ క్రికెట్ లో అంపైరింగ్ సేవలు అందించారు బిల్లీ బౌడెన్. 2013లో అంతర్జాతీయ అంపైరింగ్ ప్యానెల్ నుంచి చోటు కోల్పోయిన బిల్లీ, తిరగి 2014లో చోటు దక్కించుకున్నారు. రెండేళ్ల వ్యవధిలోనే తాజాగా మరోసారి ఆయనపై వేటు పడడం క్రికెట్ అభిమానులను కలవరపెడుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications