త్వరలో భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లు

లాహోర్: చిరకాల ప్రత్యర్ధులు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య త్వరలోనే క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు మెరుగవుతాయని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ వసీం ఖాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. లంక ఆటగాళ్లపై పేలుళ్లు జరగడంతో 2007 నుంచి భారత్-పాక్ జట్లు కేవలం ఐసీసీ, ఆసియాకప్ టోర్నీలలో మాత్రమే పాల్గొంటున్న విషయం తెలిసిందే.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం

ఏ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించలేదు:
పేలుళ్ల అనంతరం ఏ క్రికెట్ జట్టు కూడా పాకిస్థాన్‌లో పర్యటించలేదు. ఇక పాక్ చేసేదేం లేక తమ స్వదేశీ టోర్నీలను అమెరికా, దుబాయ్ వంటి దేశాల్లో నిర్వహిస్తూ వస్తోంది. ఇక భారత్ అయితే అక్కడ కూడా ఇంత వరకు ఆడలేదు. కేవలం ప్రపంచకప్, ఆసియాకప్ టోర్నీలలో మాత్రమే తలపడింది. పుల్వామా దాడి జరగడంతో ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు మరింత బలహీన పడ్డాయి.

ద్వైపాక్షిక క్రికెట్ అవసరం:
వసీం ఖాన్ పీసీబీలో చేరి ఆరు నెలలు అయింది. సోమవారం వసీం ఖాన్ మీడియాతో మాట్లాడుతూ... 'దురదృష్టవశాత్తూ రాజకీయ, దౌత్యపరమైన అంశాలు ఇరు దేశాల ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలపై ప్రభావితం చూపిస్తున్నాయి. కానీ.. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నా. మంచి పురోగతి సాధిస్తే ఇరు దేశాలకు మంచిది. ప్రస్తుత పరిస్థితులలో భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ ఎంతో అవసరం' అని ఖాన్ అభిప్రాయపడ్డారు.

పాకిస్థాన్‌కు అండగా:
తాజాగా ఐసీసీ ఫైనాన్షియల్ అండ్ కమర్షియల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కమిటీకి హెడ్‌గా పీసీబీ ఛైర్మన్ ఇషాన్‌మనీ నియామకానికి ఐసీసీ ప్రెసిడెంట్ శశాంక్ మనోహర్ మద్దతు తెలిపాడు. అంతేకాదు ఆసియా క్రికెట్ కౌన్సిల్‌లోనూ భారత అధికారులు పాకిస్థాన్‌కు అండగా నిలిచారు. ఇది రెండు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య సానుకూల వాతావరణంకు నాంది అని ఖాన్ అన్నారు.

ఆసియా కప్‌కు మద్దతు:
వచ్చే ఏడాది ఆసియా కప్ టీ20 ఈవెంట్‌ను పాకిస్థాన్ నిర్వహించడానికి బీసీసీఐ అధికారులు మద్దతు తెలిపారని కూడా వసీం పేర్కొన్నారు. డేవిస్ కప్ సందర్భంగా భారత క్రీడాకారులను పాకిస్థాన్‌కు పంపేందుకు ఇండియన్ టెన్నిస్ ఫెడరేషన్ ఆమోదం తెలిపింది. ఇక త్వరలో రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు కూడా బలపడతాయి. క్రికెట్ మ్యాచ్‌లు కూడా చూస్తాం అని ఖాన్ ధీమా వ్యక్తం చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications