Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కనివిని ఎరుగని రీతిలో: దేశవాళీ క్రికెట్‌లో అతిపెద్ద సంచలనం

Bihar U-16 boys win by an innings and 870 runs!

హైదరాబాద్: దేశవాళీ క్రికెట్‌లో సంచలన విజయం నమోదైంది. ఈ సంచలన విజయానికి విజయ్‌ మర్చంట్‌ (అండర్‌-16) ట్రోఫీ వేదిక అయింది. విజయ్‌ మర్చంట్‌ టోర్నీలో భాగంగా ఆదివారం పట్నా ఎనర్జీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు చేసిన అరుణాచల్‌ ప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 83 పరుగులకే ఆలౌటైంది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బీహార్ జట్టు పరుగుల సునామీని సృష్టించింది. బీహార్‌ బ్యాట్స్‌మెన్‌ బిన్నీ (358) ట్రిపుల్ సెంచరీతో చెలరేగగా... ప్రకాశ్‌ (220) డబుల్‌ సెంచరీతో అద్భుత ప్రదర్శన చేశాడు. మరోవైపు అర్ణవ్‌ కిశోర్‌ 129 బంతుల్లో 161 పరుగులతో వేగవంతమైన సెంచరీని సాధించాడు.

Bihar U-16 boys win by an innings and 870 runs!

దీంతో 1007/7 పరుగుల వద్ద బీహార్ జట్టు తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం 924 పరుగుల భారీ విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అరుణాచల్‌ ప్రదేశ్‌ 54 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇన్నింగ్స్‌తో పాటు 870 పరుగుల భారీ తేడాతో బీహార్‌ సంచలన విజయం నమోదు చేసింది.

బిహార్‌ బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో ఆరుగురు అరుణాచల్ ప్రదేశ్ బ్యాట్స్‌మెన్‌ డకౌట్‌ అయ్యారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, December 4, 2017, 13:31 [IST]
Other articles published on Dec 4, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+