న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బిగ్ బాస్: సల్మాన్ ఖాన్ షోలో క్రికెటర్ శ్రీశాంత్, భోరుమన్న భార్య

Bigg Boss 12: Sreesanth enters Salman Khan’s show, wife in tears

హైదరాబాద్: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహారిస్తోన్న బిగ్ బాస్ 12లో క్రికెటర్ శ్రీశాంత్ ఎంట్రీ ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీశాంత్ తన అద్భుతమైన డ్యాన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా హీరో సల్మాన్ ఖాన్ క్రికెటర్ శ్రీశాంత్‌ను స్వాగతించాడు.

జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న పేసర్ శ్రీశాంత్ బిగ్‌బాస్ హౌస్‌లోకి!జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న పేసర్ శ్రీశాంత్ బిగ్‌బాస్ హౌస్‌లోకి!

శ్రీశాంత్ మాట్లాడుతూ

శ్రీశాంత్ మాట్లాడుతూ

ఈ సందర్భంగా శ్రీశాంత్ మాట్లాడుతూ తన భార్య భువనేశ్వరి కుమారి ‘బిగ్‌బాస్'కు పెద్ద ఫ్యాన్ అని శ్రీశాంత్ చెప్పాడు. సల్మాన్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా తనకు, తన భార్యకు పదేళ్ల గ్యాప్ ఉందని శ్రీశాంత్ తెలిపాడు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ శ్రీశాంత్ భార్యను వేదిక మీదకు పిలిచారు.

భావోద్వేగానికి లోనైన శ్రీశాంత్

భావోద్వేగానికి లోనైన శ్రీశాంత్

ఈ సమయంలో శ్రీశాంత్ తన భార్య గురించి చెబుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. స్పాట్ ఫిక్సింగ్‌లో తన పేరు వచ్చినపుడు ప్రపంచమంతా తనను అదోలా చూసిందని, తన భార్య మాత్రం తన భాధను మరిపిందని చెప్పుకొచ్చాడు. శ్రీశాంత్ మాటలు విన్న అతడి భార్య స్టేజిపైనే భోరున విలపించింది. దీంతో శ్రీశాంత్ ఆమెకు దగ్గరకు తీసుకుని, తనకు ఇలాంటి భార్య దొరకడం అదృష్టమని చెప్పాడు.

శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం విధించిన బీసీసీఐ

శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం విధించిన బీసీసీఐ

ఐపీఎల్ 2013 సీజన్‌లో స్పాట్ ఫిక్సింగ్ కేసుకు పాల్పడిన శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో శ్రీశాంత్ ఎంటర్టైన్ మెంట్ రంగంలో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ఈ క్రమంలో మళయాళంతో పాటు హిందీలు పలు చిత్రాల్లో నటించాడు.

బిగ్ బాస్ 12లో పాల్గొనడానికి ముందు

బిగ్ బాస్ 12లో పాల్గొనడానికి ముందు

బిగ్ బాస్ 12లో పాల్గొనడానికి ముందు జలక్ ధికలాజా అనే డ్యాన్స్ రియాలిటీ షోలో కూడా పాల్గొన్నాడు. దీంతో పాటు రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరుపున తిరువనంతపురం నియోజకవర్గ బరిలో నిల్చున్నాడు. అయితే ఈ ఎన్నికల్లో శ్రీశాంత్ ఓటమి పాలయ్యాడు.

Story first published: Monday, September 17, 2018, 14:55 [IST]
Other articles published on Sep 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X