Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'సిరాజ్‌తో నాకు రంకు అంటగట్టారు' - అసలు విషయం బయటపెట్టిన బిగ్‌బాస్ బ్యూటీ

టీమిండియా స్టార్, హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌ ఈ మధ్య.. ఆ నటితో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడని, ఈ సింగర్‌తో ప్రేమలో ఉన్నాడని తరచుగా వార్తల్లో నిలుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బిగ్‌బాస్‌ ఫేమ్ మహిరా శర్మతో సిరాజ్‌ డేటింగ్‌ చేస్తున్నాడని కథనాలు కనిపించాయి. తాజాగా ఈ విషయంపై మహిరా శర్మ స్పందంచింది.

"చెప్పడానికి ప్రత్యేకంగా మ్యాటర్ ఏమీ లేదు. నేను ఎవరితో డేటింగ్‌ చేయట్లేదు. అయినా ఫ్యాన్స్ అన్నాక ఎవరితోనైనా మనకు సంబంధాలు అంటకట్టేస్తుంటారు. వాటిని మనం ఆపలేం. నేను పని చేసిన ఇతర యాక్టర్స్ తోనూ లింక్ పెట్టారు. వాళ్లకు నచ్చినట్టు చేస్తారు. అందుకే వాటిని నేను పెద్దగా పట్టించుకోను" అని చెప్పుకొచ్చింది.

Bigboss actress Mahira Sharma reacts on dating rumours with Mohammed Siraj

ఈ రూమర్స్ పై మహిరా శర్మ తల్లి సానియా శర్మ కూడా స్పందించింది. "ఏం మాట్లాడుతున్నారు మీరు. ప్రజలు ఏమైనా అంటారు. ఇప్పుడు నా కూతురు సెలబ్రిటీ. ఇలాంటి రూమర్స్ వస్తూనే ఉంటాయి. వాటిని మనం నమ్మాలా ఏంటి" అని చెప్పింది.

కాగా, మహిరా శర్మ 1997లో పుట్టింది. ఆమె ఫ్యామిలీ జుమ్మూ నుంచి ముంబయికి షిప్ట్ అయింది. బ్యాచులర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది మహిరా శర్మ. మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. తారక్ మెహ్తా కా ఉల్టా చెష్మాతో కెరీర్ ప్రారంభించింది. నాగిన్ 3, కుండలి భాగ్య, బెపానహ్ ప్యార్ వంటి టీవీషోలతో కాస్త గుర్తింపు తెచ్చుకుంది. బిగ్‌బాస్‌ 13తో ఒక్కసారిగా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం వెబ్‌ సిరీస్ ల్లోనూ నటిస్తోంది.

Story first published: Tuesday, March 4, 2025, 13:51 [IST]
Other articles published on Mar 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+