
హైదరాబాద్: షారూఖ్ విలువ పడిపోయింది. ఔను. నిజమే. ప్రపంచ ఖ్యాతి ఘడించిన బాలీవుడ్ బాద్ షా విలువ తగ్గిపోయింది. యువత భారీ స్థాయిలో ఫాలోవర్ల రేటు క్రమంగా తగ్గిపోయింది. కానీ ప్రపంచ స్థాయిలో ఆ విలువ మళ్లీ భారతీయునికే దక్కింది. అదీ మన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకే దక్కింది.

క్రీడారంగంలో అయితే ఇప్పటి వరకు టాప్ స్థాయిలో కొనసాగుతున్న లియోనల్ మెస్సీని కూడా విరాట్ కోహ్లీ దాటేశాడు. ప్రస్తుతం భారత్‌లో అత్యధిక బ్రాండ్ విలువ కలిగిన సెలెబ్రిటీగా అవతరించాడు. బాలీవుడ్ సూపర్‌స్టార్, బాద్ షా షారుఖ్ ఖాన్‌ను సైతం అధిగమించాడు. ప్రముఖ
కార్పొరేట్ సలహా సంస్థ డఫ్ అండ్ ఫెల్ప్స్ ఈ నివేదికను బుధవారం విడుదల చేసింది.
బ్రాండ్ విలువలు:
భారత సెలెబ్రిటీల్లో కోహ్లి రూ. 921 కోట్ల బ్రాండ్ విలువతో అగ్రస్థానంలో ఉండగా.. షారుఖ్ ఖాన్ రూ. 678 కోట్ల బ్రాండ్ విలువతో రెండో స్థానానికి పడ్డాడు. దీపికా పదుకొనె (రూ. 595 కోట్లు) మూడు, అక్షయ్ కుమార్ (రూ. 300 కోట్లు) నాలుగో స్థానాల్లో నిలిచారు.
ఇదే తొలిసారి:
సెలెబ్రిటీల బ్రాండ్ విలువను ప్రకటించడం ఆరంభించాక షారుఖ్ ఖాన్ అగ్రస్థానం కోల్పోవడం ఇదే తొలిసారి అని డఫ్ అండ్ ఫెల్ప్స్ సంస్థ ప్రకటించింది. టాప్-15 జాబితాలో పి.వి. సింధుకు చోటు లభించింది. ఆమె రూ. 95 కోట్ల బ్రాండ్ విలువతో 15వ స్థానంలో నిలిచింది. ఈ
జాబితాలో చోటు దక్కించుకున్న మహిళా క్రీడాకారిణి సింధు మాత్రమే.
ధోని రూ. 134 కోట్ల విలువతో 13వ స్థానంలో ఉన్నాడు. భారత్‌లో ప్రసారమయ్యే వాణిజ్య ప్రకటనల్లో 50 శాతం.. టాప్-15 జాబితాలో ఉన్నవారివేనట. నిరుడు ఈ జాబితాలోని వారు 205 ప్రకటనల్లో నటించగా.. ఈసారి ఆ సంఖ్య 234కు చేరుకుంది! వాణిజ్య ప్రకటన కోసం సెలెబ్రిటీలు
ఒప్పందం చేసుకునే సంస్థల విలువ ఆధారంగా బ్రాండ్ విలువను లెక్కిస్తారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను
target="_blank">గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.