Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsBAN: రెండో టెస్టుకు ముందు టీమిండియాకు గట్టి షాక్.. ఆ ఇద్దరూ అవుట్!

Big Shock to Team India before second INDvsBAN test

బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు మ్యాచ్‌కు భారత్ సిద్ధం అవుతోంది. తొలి టెస్టులో ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్ ఈ మ్యాచ్‌లో కూడా ఎలాగైనా గెలిచి సిరీస్ క్లీన్‌స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది. అదే సమయంలో రెండో టెస్టులో అయినా గెలిచి తమ సత్తా చాటాలని బంగ్లా కూడా ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో భారత్‌కు గట్టి షాక్ తగిలింది. గాయంతో ఇద్దరు ఆటగాళ్లు జట్టుకు దూరమైనట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.

నో రోహిత్.. బీసీసీఐ క్లారిటీ..

నో రోహిత్.. బీసీసీఐ క్లారిటీ..

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ బొటనవేలికి గాయమైన సంగతి తెలిసిందే. స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా అతనికి ఈ గాయమైంది. అప్పటికప్పుడు మైదానం వీడిన అతన్ని ఢాకాలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మూడో వన్డే ఆడించకుండా చికిత్స కోసం ముంబై పంపిచారు. 'రెండో వన్డేలో తగిలిన బొటన వేలి గాయం నుంచి రోహిత్ కోలుకుంటున్నాడు.

అయితే పూర్తిగా ఈ గాయం నుంచి కోలుకొని పూర్తి ఇంటెన్సిటీతో బ్యాటింగ్, ఫీల్డింగ్ చేయాలంటే రోహిత్‌కు మరింత విశ్రాంతి అవసరం అని బీసీసీఐ మెడికల్ టీం భావించింది. అందుకే అతన్ని రెండో టెస్టు ఆడించడం లేదు' అని బీసీసీఐ ప్రకటించింది.

యువపేసర్ కూడా దూరం..

యువపేసర్ కూడా దూరం..

కేవలం రోహిత్ ఒక్కడే కాదు యువ పేసర్ నవదీప్ సైనీ కూడా రెండో టెస్టులో ఆడటం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. అంతకుముందు బంగ్లా పర్యటనకు ప్రకటించిన జట్టులో సైనీకి చోటు దక్కింది. కానీ గాయం కారణంగా అతను తొలి టెస్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు అతనికి కడుపులో కండరాల నొప్పి వచ్చిందని, దీంతో బంగ్లాతో రెండో టెస్టుకు కూడా సైనీ దూరమవుతున్నాడని బీసీసీఐ వెల్లడించింది. ప్రస్తుతానికి అతన్ని ఎన్సీయే (నేషనల్ క్రికెట్ అకాడమీ)కి పంపుతున్నామని, అక్కడ కోలుకున్న తర్వాత అతనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

భారత బృందం ఇదే..

భారత బృందం ఇదే..

బంగ్లాతో జరిగే రెండో టెస్టులో రోహిత్, సైనీ ఆడటం లేదని వెల్లడించిన బీసీసీఐ.. ఈ మ్యాచ్ కోసం రివైజ్ చేసిన భారత బృందాన్ని ప్రకటించింది. రోహిత్ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌ను కంటిన్యూ చేసింది. అలాగే సైనీ స్థానంలో జయదేవ్ ఉనద్కత్ కొనసాగుతున్నాడు.

భారత బృందం: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛటేశ్వర్ పుజారా (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, అభిమన్యు ఈశ్వరన్, సౌరభ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్.

Story first published: Tuesday, December 20, 2022, 16:58 [IST]
Other articles published on Dec 20, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+