Shahid Afridi: పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిదికి భారత ప్రభుత్వం నుంచి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. షాహిద్ అఫ్రిదిపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిజానికి పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి షాహిద్ అఫ్రిది భారత్‌పై తన కోపాన్ని వెళ్లగక్కుతున్నాడు. అఫ్రిది భారత సైన్యం, ప్రభుత్వంపై నిరంతరం విషం కక్కుతున్నాడు. ఈ క్రమంలో భారత ప్రభుత్వం షాహిద్ అఫ్రిదిపై కఠిన చర్యలు తీసుకుంది.
కఠిన చర్యలు తీసుకున్న భారత ప్రభుత్వం
భారత ప్రభుత్వం షాహిద్ అఫ్రిదికి బిగ్ షాక్ ఇచ్చింది. భారత్‌లో షాహిద్ అఫ్రిది యూట్యూబ్ ఛానెల్ బ్లాక్ చేయబడింది. దీని అర్థం అఫ్రిది తన యూట్యూబ్ ఛానెల్‌లో ఏ వీడియోను అప్‌లోడ్ చేసినా భారత్‌లోని ప్రజలు దానిని చూడలేరని ఇప్పుడు స్పష్టమైంది. ఈ చర్య వారికి భారీ నష్టాలను కలిగిస్తుంది.

భారత్‌పై విషం చిమ్మారు..
ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తర్వాత షాహిద్ అఫ్రిది భారతదేశంపై విషం కక్కాడు. దీనితో పాటు షాహిద్ అఫ్రిది భారత ఆటగాళ్లను కూడా లక్ష్యంగా చేసుకున్నాడు. దేశం కోసం చాలా క్రికెట్ ఆడిన, రాయబారులుగా కూడా పని చేసిన భారత్‌కు చెందిన ఇద్దరు కీలక ఆటగాళ్లు పాకిస్థాన్ ను ప్రత్యక్షంగా బహిష్కరించాలని డిమాండ్ చేశారని షాహిద్ అఫ్రిది అన్నాడు. ఒక సంబంధాన్ని తెంచుకోవాల్సి వస్తే, దానిని అర్థమనస్కంగా కాకుండా పూర్తిగా తెంచుకోవాలన్నాడు.
దీటైన సమాధానం ఇచ్చిన శిఖర్ ధావన్
షాహిద్ అఫ్రిదికి తగిన సమాధానం ఇస్తూ శిఖర్ ధావన్ కార్గిల్ లో కూడా నిన్ను ఓడించారని.. నువ్వు ఇప్పటికే చాలా దిగజారిపోయావన్నారు. ఇంకా ఎంత దిగజారిపోతావోనని అన్నాడు. అర్థం లేని మాటలు మాట్లాడే బదులు మీ దేశ పురోగతిపై దృష్టి పెట్టాలని షాహిద్ అఫ్రిదిని ఉద్ధేశించి శిఖర్ ధావన్ పేర్కొన్నాడు. భారత సైన్యం పట్ల గర్వంగా ఉందన్నాడు. శిఖర్ ధావన్ ప్రకటన తర్వాత షాహిద్ అఫ్రిది ఒక పోస్టును పంచుకోవడం ద్వారా స్పందించాడు. ఈ సారి అఫ్రిది అన్ని హద్దులు దాటాడు. శిఖర్ ధావన్ ను విమర్శిస్తూ.. గెలుపు ఓటముల గురించి మర్చిపో శిఖర్.. నేను నీకు టీ ఇస్తానని అన్నాడు.