Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వార్నర్‌‌కు బిగ్ షాక్.. తిరిగి ఇచ్చేయని వేడుకుంటూ ఎమోషనల్ వీడియో

టెస్టులతో పాటు వన్డేలకు గుడ్‌బై చెప్పిన ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు షాక్ ఎదురైంది. విలువైన వస్తువులు ఉన్న తన బ్యాగ్‌ను పోగొట్టుకున్నాని వార్నర్ చెప్పాడు. అందులో బ్యాగీ గ్రీన్ ఉందని తెలిపాడు. దీంతో తన ఫేర్‌వెల్ టెస్టు ముందు బ్యాగీ గ్రీన్ పోగొట్టుకున్నందుకు వార్నర్ ఎమోషనల్ అయ్యాడు. తిరిగి ఇచ్చేయమని వేడుకుంటూ భావోద్వేగంతో సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. రిటర్న్ ఇచ్చిన వారికి మంచి గిఫ్ట్ ఇస్తానని కూడా హామీ ఇచ్చాడు.

టెస్టు అరంగేట్రంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు బ్యాగీ గ్రీన్ క్యాప్‌ను పొందుతారు. దాన్ని వారు ఎంతో గౌరవంగా భావిస్తారు. అలాంటి బ్యాగీ గ్రీన్‌ను తన చివరి టెస్టు ముందు కనిపించకపోవడంతో వార్నర్ తట్టుకోలేకపోతున్నాడు. సిడ్నీ వేదికగా రేపటి నుంచి పాకిస్థాన్‌తో ప్రారంభమయ్యే టెస్టు వార్నర్‌‌కు ఆఖరిది. కాగా, సొంతమైదానంలో తన ఫేర్‌వెల్ మ్యాచ్ గ్రాండ్‌గా ఆడాలనుకున్న అతడికి ఈ సంఘటన జరగడం పెద్ద షాకింగ్.

Big shock to David Warner. Emotional video begging to be returned Baggy Green cap

అయితే రెండో టెస్టు ముగిసిన అనంతరం మెల్‌బోర్న్ నుంచి సిడ్నీకి వస్తున్న మార్గం మధ్యలో అది మిస్ అయి ఉంటుందని వార్నర్ భావిస్తున్నాడు. సీసీటీవీ ఫుటేజిలో పరిశీలించిన దొరకలేదని వివరించాడు. ''నా లగేజ్ నుంచి నా బ్యాక్‌పాక్‌ను ఎవరో తీసుకున్నారు. అందులో నా పిల్లల వస్తువులు ఉన్నాయి. అలాగే నా బ్యాగీ గ్రీన్ కూడా ఉంది. అది నాకెంతో సెంటిమెంట్. తిరిగి అది పొందాలనుకుంటున్నా. మీకు బ్యాక్‌పాక్ కావాలనుకుంటే నేను మరో బ్యాక్‌పాక్ ఇస్తాను. అలాగే మీకు ఎలాంటి ఇబ్బంది కలుగజేయను. నా బ్యాగీ గ్రీన్ తిరిగిఇస్తే ఎంతో ఆనందంగా ఉంటా'' అని వార్నర్ అన్నాడు.

ఆస్ట్రేలియా తరపున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆరో బ్యాటర్ డేవిడ్ వార్నర్. 161 మ్యాచ్‌ల్లో 45 సగటుతో 6932 పరుగులు చేశాడు. అలాగే అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన రెండో ఆసీస్ ప్లేయర్‌గా వార్నర్ నిలిచాడు. వన్డేల్లో రికీ పాంటింగ్ 29 సెంచరీలు సాధించగా, వార్నర్ 22 శతకాలు సాధించాడు. కాగా, వన్డేలు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్ టీ20ల్లో కొనసాగనున్నాడు. అలాగే ఇతర ఫ్రాంచైజీ లీగుల్లో పాల్గొంటాడు.

Story first published: Tuesday, January 2, 2024, 9:50 [IST]
Other articles published on Jan 2, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+