టీ20 వరల్డ్ కప్‌కు ముందు ఆసీస్‌కు బిగ్ షాక్!
టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి మరికొద్ది రోజులే సమయం ఉన్న నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫినిషర్, ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తరపున ఆడే టిమ్ డేవిడ్ మరోసారి గాయపడ్డాడు. బిగ్ బాష్ లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఆయన హ్యామ్‌స్ట్రింగ్(తొడ వెనుక భాగంలో ఉండే కండరాల సమూహం) గాయానికి గురవ్వడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.
మైదానంలోనే కుప్పకూలిన టిమ్ డేవిడ్
శుక్రవారం రాత్రి పెర్త్ స్టేడియంలో హోబర్ట్ హరికేన్స్, పర్త్ స్కార్చర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. హోబర్ట్ తరపున ఆడుతున్న టిమ్ డేవిడ్ 28 బంతుల్లో 42 పరుగులు చేసి మంచి ఫామ్‌లో కనిపించాడు. అయితే రెండో పరుగు తీసే క్రమంలో అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పితో మైదానంలోనే కుప్పకూలారు. పరిస్థితి విషమించకుండా ఉండేందుకు ఆయన వెంటనే 'రిటైర్డ్ హర్ట్'గా వెనుదిరిగారు.

వరల్డ్ కప్ ఆడటంపై సందిగ్ధం
ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. బిగ్ బాష్ లీగ్ జనవరి 25తో ముగుస్తుంది. అంటే టిమ్ డేవిడ్ కోలుకోవడానికి కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉంది. 2025 ఐపీఎల్ సీజన్‌లో కూడా టిమ్ డేవిడ్ ఇదే తరహా హ్యామ్‌స్ట్రింగ్ గాయానికి గురయ్యారు. గత ఐపీఎల్‌లో గాయం కారణంగానే ఆయన ఆర్సీబీ తరపున ప్లేఆఫ్ మ్యాచ్‌లకు దూరమయ్యారు. ఆ సమయంలో కోలుకోవడానికి సుమారు రెండు నెలల సమయం పట్టింది. ఇప్పుడు మళ్లీ అదే గాయం తిరగబెట్టడంతో ఆస్ట్రేలియా సెలెక్టర్లు తలలు పట్టుకుంటున్నారు.
ఆస్ట్రేలియా 'పవర్ హౌస్'
టిమ్ డేవిడ్ ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టులో అత్యంత కీలకమైన ఆటగాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఆయన 168.88 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచాడు. వచ్చే నెలలో ఆస్ట్రేలియా తన 15 మంది సభ్యుల ప్రపంచకప్ జట్టును ప్రకటించాల్సి ఉంది. ఒకవేళ టిమ్ డేవిడ్ దూరం అయితే, డెత్ ఓవర్లలో సిక్సర్ల వర్షం కురిపించే మరో ఆటగాడిని వెతకడం ఆసీస్ కెప్టెన్, కోచ్‌లకు పెద్ద సవాలుగా మారనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications