టీమిండియాకు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌కు తెలుగోడు దూరం!
భారత క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. యువ సంచలనం, తెలుగు తేజం తిలక వర్మ కడుపు సంబంధిత తీవ్రమైన గాయం కారణంగా రాబోయే న్యూజిలాండ్ సిరీస్‌తో పాటు ఫిబ్రవరిలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026కు కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అసలేం జరిగిందంటే?
రాజ్‌కోట్‌లో జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టు తరఫున ఆడుతున్న తిలక్ వర్మకు బుధవారం ఉదయం అకస్మాత్తుగా కడుపులో తీవ్రమైన నొప్పి వచ్చింది. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వైద్యులు స్కాన్ నివేదికలను పరిశీలించిన తర్వాత తిలక్ వర్మకు అత్యవసరంగా సర్జరీ అవసరమని సూచించారు.

రికవరీకి పట్టే సమయం
సర్జరీ తర్వాత కోలుకోవడానికి కనీసం 3 నుంచి 4 వారాల సమయం పడుతుంది. టీ20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ స్వల్ప సమయంలో తిలక్ వర్మ పూర్తి ఫిట్‌నెస్ సాధించడం కష్టమని తెలుస్తోంది. దీనివల్ల తిలక్ వర్మ న్యూజిలాండ్ సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు.
శ్రేయస్ అయ్యర్ రీ-ఎంట్రీ?
ఓ వైపు తిలక్ వర్మ గాయం ఆందోళన కలిగిస్తుంటే.. మరోవైపు శ్రేయస్ అయ్యర్ పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి రావడం టీమిండియాకు ఊరటనిచ్చే అంశం. గతేడాది గాయపడిన శ్రేయస్ అయ్యర్.. ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున ఆడి తన ఫామ్‌ను నిరూపించుకున్నాడు. తిలక్ వర్మ అందుబాటులో లేకపోతే అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను టీ20 జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
టీమిండియా ముందున్న ఛాలెంజ్
మిడిలార్డర్‌లో తనదైన శైలిలో దూకుడుగా ఆడే తిలక్ వర్మ లేకపోవడం జట్టుకు పెద్ద లోటే. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీకి ముందు అతని స్థానాన్ని భర్తీ చేసే సరైన ఆటగాడిని వెతకడం ఇప్పుడు సెలక్టర్లకు పెద్ద సవాలుగా మారింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications