IND vs NZ: కీలక మ్యాచ్‌కు ముందు భారత్‌కు బిగ్ షాక్.. ప్రాక్టీస్‌కు దూరంగా రోహిత్, గిల్!
IND vs NZ: వరుసగా రెండు మ్యాచ్ లలో గెలిచి టీమిండియా సెమీస్‌కు దూసుకెళ్లింది. అదే ఉత్సాహంతో న్యూజిలాండ్ తో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లోనూ గెలవాలని టీమిండియా భావిస్తోంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొంది. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నెట్ ప్రాక్టీస్ కు హాజరుకాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. న్యూజిలాండ్ తో ఆదివారం భారత్ తలపడనుంది. ఈ పరిస్థితిలో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ కొంత అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
రోహిత్ న్యూజిలాండ్ తో ఆడుతాడా?
గాయాల బెడద భారత క్రికెటర్లను ఇబ్బందులకు గురి చేస్తోంది. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ కండరాల నొప్పితో బాధపడ్డాడు. అయితే ఆ సమయంలో అది పెద్ద విషయమేమీ కాదని.. తాను బాగానే ఉన్నానని చెప్పాడు.ఐసీసీ అకాడమీలో మిగతా ఆటగాళ్లంతా భారీ కసరత్తులు చేస్తుండగా.. రోహిత్ శర్మ మెల్లగా జాగింగ్ చేసినట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ భారత జట్టు రెగ్యులర్ బ్యాటింగ్ లేదా ఫీల్డింగ్ ప్రాక్టీస్ లో పాల్గొనలేదని తెలిసింది. అందువల్ల రోహిత్ శర్మ కండరాల నొప్పులతో తీవ్రంగా బాధపడుతున్నట్లు అనుమానం కలుగుతోంది. రోహిత్ శర్మ న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లో ఆడగలడా?.. అనే సందేహం కూడా కలుగుతోంది.

ప్రాక్టీస్ కు రాని గిల్
రోహిత్ శర్మ ఈ మ్యాచ్ ఆడలేకపోతే.. న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్ లో వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీని చేపట్టాల్సి ఉంటుంది. అయితే గిల్ కూడా అనారోగ్యంతో ఉన్నారని వార్తలు వెలువడ్డాయి. ఇది మరింత ఆందోళనలను రేకెత్తిస్తోంది. భారత జట్టు నెట్ ప్రాక్టీస్ సమయంలో వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ లో పాల్గొనలేదు. గిల్ స్టేడియానికి కూడా రాలేదని తెలిసింది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేసిన గిల్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.
ప్లేయింగ్ 11లో మార్పులు జరుగుతాయా?
పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా జట్టు రిజర్వ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ జ్వరంతో బాధపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు పంత్ కోలుకుని బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసినట్లు తెలిసింది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఇప్పుడు ఆడతారా?.. అనే సందేహాలు తలెత్తిన నేపథ్యంలో రిషబ్ పంత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ లో పాల్గొనడం మంచి విషయమే. భారత ఆటగాళ్ల ఫిట్‌నెస్ పై ఆందోళనల దృష్ట్యా న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లో ప్లేయింగ్ 11లో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. కొందరు ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి అవకాశం రాని ఆటగాళ్లను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. మరో వైపు, మహ్మద్ షమీ కూడా చీలమండలో నొప్పితో బాధపడుతున్నాడు. న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ కు మహ్మద్ షమీకి కూడా విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది.
Smiles 🔛
— BCCI (@BCCI) February 27, 2025
Energy levels high 😎
Raw 🔊 moments from #TeamIndia's training session ahead of the match against New Zealand 👌👌
WATCH 🎥🔽 #ChampionsTrophy | #INDvNZhttps://t.co/zH6nwdzah4
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications