Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Gujarat Titans: గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్.. జట్టును వీడిన విధ్వంసక ఆల్‌రౌండర్!

Gujarat Titans: ఐపీఎల్ 2025 సీజన్ మధ్య గుజరాత్ టైటాన్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింగి. స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ గుజరాత్ టైటాన్స్ జట్టుకు దూరమయ్యాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో అద్భుతంగా రాణిస్తున్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు గ్లెన్ ఫిలిప్స్ దూరం కావడం పెద్ద దెబ్బే. గ్లెన్ ఫిలిప్స్ జట్టు నుంచి అకస్మాత్తుగా దూరం కావడానికి వివరాలు స్పష్టంగా లేనప్పటికీ.. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గాయం కారణంగా దూరం అయినట్లు తెలుస్తోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) త్వరలో గ్లెన్ ఫిలిప్స్ గురించి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

గ్లెన్ ఫిలిప్స్ గురించి గుజరాత్ టైటాన్స్ ప్రకటన
గ్లెన్ ఫిలిప్స్ గాయంపై గుజరాత్ టైటాన్స్ జట్టు కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. గ్లెన్ ఫిలిప్స్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. 'గ్లెన్ ఫిలిప్స్ త్వరగా కోలుకోవాలని గుజరాత్ టైటాన్స్ కోరుకుంటోంది." అని ఆ జట్టు తన ప్రకటనలో తెలిపింది.

Big Shock for Gujarat Titans as Destructive All-Rounder Glenn Phillips Departs

ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించిన గ్లెన్ ఫిలిప్స్
ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోపీలో న్యూజిలాండ్ తరపున ఈ 28 ఏళ్ల ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ అద్భుతంగా రాణించాడు. తన ఫిట్‌నెస్, అథ్లెటిజంతో పాకిస్థాన్, దుబాయ్ లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ న్యూజిలాండ్ ఆటగాడు కొన్ని అద్భుతమైన క్యాచ్‌లు పట్టాడు. ఏప్రిల్ 6న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు గ్లెన్ ఫిలిప్స్ గాయపడినట్లు తెలుస్తోంది.

ఈ సీజన్‌లో ఫిలిప్స్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు..
ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు తరపున ఆడిన ఏ మ్యాచ్‌లోనూ గ్లెన్ ఫిలిప్స్ కనిపించలేదు. గ్లెన్ ఫిలిప్స్ స్థానంలో ప్రత్యామ్నాయ ఆటగాడి కోసం ఫ్రాంచైజీ చూస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. శుభ్‌మన్ గిల్ జట్టు శనివారం లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆ జట్టు ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

Story first published: Saturday, April 12, 2025, 12:29 [IST]
Other articles published on Apr 12, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+