Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లాండ్‌కు బిగ్ షాక్! భారత్ సిరీస్ నుంచి తప్పుకున్న స్టార్ ప్లేయర్

టీమిండియాతో టెస్టు సిరీస్ ప్రారంభంకాక ముందే ఇంగ్లాండ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వ్యక్తిగత కారణాలతో భారత్‌ సిరీస్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం అబుదాబిలో ఉన్న అతడు ఇండియాకు రాకుండా తిరిగి ఇంగ్లాండ్‌కు పయనమవుతాడని ఇంగ్లాండ్ క్రికెటర్ బోర్డు (ఈసీబీ) వెల్లడించింది.

''వ్యక్తిగత కారణాలతో హ్యారీ బ్రూక్ తక్షణమే ఇంగ్లాండ్ జట్టును వీడి స్వదేశానికి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అతడు భారత్‌కు వెళ్లడం లేదు '' అని ఈసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సమయంలో బ్రూక్ గోప్యత విషయాల్లో ఎవరూ జోక్యం చేసుకోవదద్దని మీడియాను, ప్రజలను ఈసీబీ కోరింది. బ్రూక్‌తో పాటు అతడి కుటుంబ ప్రైవేట్ విషయాలకు దూరంగా ఉండాలని తెలిపింది.

Big shock for England! Star player withdraws from India series

అయితే బ్రూక్‌ జట్టుకు దూరమవ్వడం ఇంగ్లాండ్ ప్రతికూలాంశమే. డైనమిక్ బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్న అతడు గత 18 నెలలుగా ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 12 టెస్టుల్లో 1181 పరుగులు చేశాడు. 62 సగటుతో, 91 స్ట్రైక్‌ రేటుతో సత్తాచాటాడు. 2022 చివరిలో పాకిస్థాన్ టెస్టు సిరీస్‌లో అదరగొట్టాడు. 98 సగటుతో అయిదు ఇన్నింగ్స్‌ల్లో 468 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.

అయితే బ్రూక్ స్థానంలో భర్తీ చేసే మరో ఆటగాడి గురించి ఈసీబీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇంగ్లాండ్ టెస్టు జట్టు అబుదాబి నుంచి భారత్‌కు ఆదివారం చేరనుంది. మరోవైపు కొందరు టీమిండియా ప్లేయర్లు హైదరాబాద్‌కు ఇప్పటికే చేరుకున్నారు. విరాట్ కోహ్లి ఇవాళ హైదరాబాద్‌కు వచ్చాడు. జనవరి 25 నుంచి ప్రారంభమయ్యే అయిదు టెస్టు సిరీస్‌లో తొలి టెస్టు ఉప్పల్ వేదికగానే జరగనున్న విషయం తెలిసిందే. విశాఖపట్నంలో జరగనున్న రెండో టెస్టు ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కానుంది. చివరి మూడు టెస్టులు రాజ్‌కోట్, రాంచీ, ధర్మశాల వేదికగా జరగనున్నాయి.

ఇంగ్లాండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జేమ్స్ ఆండర్సన్, గస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, షోయబ్ బషీర్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, ఒల్లీ పోప్, ఆలీ రాబిన్సన్, జో రూట్, మార్క్ వుడ్

తొలి రెండు టెస్టులకు ఎంపికైన టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఆవేశ్ ఖాన్

Story first published: Sunday, January 21, 2024, 16:17 [IST]
Other articles published on Jan 21, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+