మెల్‌బోర్న్: భారత్‌తో జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కూడా తమకు అన్ని మ్యాచ్‌లలాగేనని బంగ్లాదేశ్ సారథి షకీబ్ ఆల్ హసన్ అన్నాడు. క్వార్టర్ ఫైనల్లో భారత్ - బంగ్లాదేశ్ జట్లు తలపడనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను మరో పెద్ద మ్యాచ్‌గా విశ్లేషకులు, అభిమానులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో దీనిపై షకీబ్ స్పందించాడు. ఈ మ్యాచ్‌ను అందరు హోరాహోరీ పోరుగా భావించవచ్చునని, తమ కెరీర్‌లో ఇది పెద్ద మ్యాచ్ కావొచ్చునని చెప్పాడు. ఎందుకంటే తొలిసారి తాము క్వార్టర్ ఫైనల్స్‌కు చేరామని చెప్పాడు. అన్ని మ్యాచుల్లాగే ఇది కూడా మరో మ్యాచ్ అంతే అన్నాడు.
ఇదో పెద్ద మ్యాచ్ అయినప్పటికీ.. మరో మ్యాచ్ అంతే అన్నాడు. తమ పైన ఒత్తిడి ఎలాగ ఉంటుందో తనకు అనుభవం ఉందని చెప్పాడు. తాను ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్నానని చెప్పాడు. ఈ అనుభవం నేపథ్యంలో భారత జట్టుతో అడే విషయమై అవగాహన వస్తుందని చెప్పాడు.

భారత్‌లో ఐపీఎల్లో ఆడినందున... భారత జట్టుతో ఎలా ఆడాలనే విషయాన్ని తన జట్టు సహచరులకు పంచుతానని చెప్పాడు. భారత జట్టులో ఆరుగురు వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్ ఉన్నారని, వారు ఎక్కువ పరుగులు చేయకుండా తాము చూడాలని చెప్పాడు.
జింబాబ్వేతో భారత జట్టు మ్యాచ్‌ను చూశామని, అద్భుతంగా గెలిచారని అభిప్రాయపడ్డాడు. ధోనీకి కితాబిచ్చాడు. కీలక సమయంలో ధోనీ ప్రశాంతంగా ఒత్తిడి లేకుండా ఉన్నాడని చెప్పాడు. తడబడినా ధోనీ వల్ల టార్గెట్ రీచయిందన్నాడు. ప్రపంచ కప్‌లో ఏ జట్టు కూడా ప్రత్యర్థి జట్టును తేలిగ్గా తీసుకోదన్నాడు.
ఇది క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ అని, కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఉంటుందని, కాబట్టి ఎవరు కూడా దీనిని తేలికగా తీసుకోరన్నాడు. తాము బాగానే ఆడుతున్నామని చెప్పాడు. అలాగే తదుపరి మ్యాచ్‌లో గెలుస్తామనే విశ్వాసం బాగానే ఉందన్నాడు.