Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఉద్యోగాలకు రాజీనామా చేయండి: కోహ్లీసేనకు బీసీసీఐ షాక్

హైదరాబాద్: టీమిండియాకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) షాకిచ్చింది. క్రికెటర్లు ఏ ప్రభుత్వ రంగ కంపెనీల్లో ఉద్యోగం చేయకూడదంటూ కోహ్లీసేనకు బీసీసీఐ నోటీసులు పంపించింది. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు రాజీనామా చేయాలని సూచించింది.

బీసీసీఐ తాజా నిర్ణయంతో భారత జట్టులోని పలువురు క్రికెటర్లు ఉద్యోగాలు కోల్పోనున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు శిఖర్ ధావన్, అజ్యింకే రహానే, ఇషాంత్ శర్మ, ఛటేశ్వర్ పుజారా, గౌతం గంభీర్‌లు ప్రభుత్వ రంగ కంపెనీల్లో ఉద్యోగులుగా ఉన్నారు.

Big Blow For Virat Kohli And Company As BCCI Wants Them To Quit Their Jobs In Public Sector Companies

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓఎన్జీసీలో మేనేజర్‌గా ఉన్నారు. గతంలో ఓఎన్జీసీ నిర్వహించిన అనేక స్ధానిక టోర్నీల్లో కోహ్లీ ఆడిన సందర్భాలు ఉన్నాయి. ఢిల్లీకి చెందిన పలువురు క్రికెటర్లకి ఓఎన్జీసీ ఉద్యోగ అవకాశాలు కల్పించింది.

వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్ లాంటి క్రికెటర్లు ఓఎన్జీసీలో గౌరవ ప్రదమైన స్ధానాల్లో ఉన్నారు. సుప్రీం కోర్టు నియమించిన పరిపాలనా కమిటీ సూచన మేరకే బీసీసీఐ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+