Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియా పర్యటనకు ముందు టీమిండియాకు బిగ్ షాక్!

టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధమవుతోంది. ఆసీస్‌తో జరగబోయే కీలకమైన టీ20 సిరీస్‌కు టీమిండియా సన్నద్ధమవుతున్న సమయంలో టీమిండియాకు ఆల్‌రౌండర్ శివమ్ దూబే గాయం రూపంలో అనూహ్య ఆందోళన ఎదురైంది. అక్టోబర్ 29 నుంచి ప్రారంభం కానున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కేవలం రెండు వారాల ముందు ఈ స్టార్ ఆటగాడికి సమస్య తలెత్తడం జట్టు వ్యూహాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

టీమిండియా ఆస్ట్రేలియా పూర్తి స్థాయి వైట్-బాల్ పర్యటన కోసం సిద్ధమవుతోంది. అక్టోబర్ 19 నుంచి మూడు వన్డేలు, ఆ తర్వాత టీ20 సిరీస్ జరగనుంది. 2026 టీ20 ప్రపంచ కప్ సన్నాహాల్లో భాగంగా ఈ సిరీస్ అత్యంత కీలకం కాగా.. ఈ సమయంలోనే శివమ్ దూబే గాయపడటం ఆందోళన కలిగిస్తోంది. శివమ్ దూబే వెన్ను పట్టేసిన సమస్యతో బాధపడుతున్నాడు. దీని కారణంగా ముంబై జట్టు జమ్మూ కాశ్మీర్‌తో శ్రీనగర్‌లో ఆడబోయే తమ తొలి రంజీ ట్రోఫీ 2025/26 మ్యాచ్‌కు శివమ్ దూబే అందుబాటులో ఉండడు.

Big Blow to Team India Ahead of Australia Tour Shivam Dube Injured

శివమ్ దూబే నిజానికి మ్యాచ్ కోసం శ్రీనగర్‌కు జట్టుతో కలిసి వెళ్లాడు. అయితే అక్కడి తీవ్రమైన చల్లని వాతావరణం దూబే వెన్నునొప్పికి కారణమైంది. దీంతో వైద్య బృందం వెంటనే విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇవ్వడంతో దూబే మంగళవారం (అక్టోబర్ 14) ముంబైకి తిరిగి వచ్చినట్లు ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) వర్గాలు ధ్రువీకరించాయి.

ఆస్ట్రేలియా పర్యటనకు శివమ్ దూబే సిద్ధమవుతాడా?
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 7 నెలల విరామం తర్వాత వైట్-బాల్ క్రికెట్లోకి తిరిగి వస్తుండటం.. శుభ్‌మన్ గిల్ వన్డే కెప్టెన్‌గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించడం వంటి కారణాల వల్ల ఈ ఆస్ట్రేలియా పర్యటన చాలా ప్రత్యేకం. ముఖ్యం టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన 16 మంది సభ్యుల జట్టులో శివమ్ దూబే ఓ కీలకమైన ఆల్‌రౌండర్‌గా ఉన్నాడు. దూబే దూకుడు బ్యాటింగ్, మీడియం పేస్ బౌలింగ్ జట్టుకు చాలా అవసరం. ఈ సమయంలో గాయం ఆందోళన కలిగిస్తున్నప్పటికీ.. గుడ్ న్యూస్ ఏంటంటే..దూబే గాయం పెద్దది కాదని నివేదికలు చెబుతున్నాయి. దూబే సమయానికి పూర్తిగా ఫిట్‌గా మారతాడని, అక్టోబర్ 23న భారత జట్టుతో కలిసి ఆస్ట్రేలియాకు బయలుదేరతాడని భావిస్తున్నారు. ముంబై జట్టు కూడా ఈ స్టార్ ఆల్‌రౌండర్ ఈ వారం చివరి నాటికి కోలుకుంటాడని ఆశిస్తోంది.ఈ గాయం రంజీ ట్రోఫీలో ముంబైకి ఎదురుదెబ్బ అయినప్పటికీ, ఆస్ట్రేలియా టూర్ సమయానికి దూబే సిద్ధంగా ఉంటే అది టీమిండియాకు పెద్ద ఊరట అవుతుంది.

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (వైస్-కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్.

Story first published: Wednesday, October 15, 2025, 11:34 [IST]
Other articles published on Oct 15, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+