Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 : ఆర్సీబీకి మరో గట్టి షాక్.. గాయంతో ఐపీఎల్‌కు యంగ్ స్టార్ దూరం!

ఐపీఎల్ ఆరంభంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూ (ఆర్సీబీ)కి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ జట్టు కీలక ప్లేయర్ రజత్ పటీదార్ కూడా ఐపీఎల్ 16వ సీజన్‌కు దూరమయ్యాడు. అతను మడమ గాయంతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో అతను ఈ ఐపీఎల్‌లో కొన్ని మ్యాచులు ఆడడని ఆర్సీబీ భావించింది. ఫ్యాన్స్ కూడా దీనికి ప్రిపేర్ అయ్యారు. కానీ ఇప్పుడు వాళ్లందరికీ పెద్ద షాక్ తగిలింది.

పటీదార్ గాయం చాలా సీరియస్‌ అవడంతో అతను ఈ సీజన్ ఆడటం కరెక్ట్ కాదని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీయే) వైద్యులు చెప్పారట. ఈ విషయాన్ని ఆర్సీబీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. 'దురదృష్టవశాత్తూ ఐపీఎల్ 2023కు రజత్ పటీదార్ దూరమయ్యాడు. అతని మడమ గాయం వల్ల ఈ సీజన్ ఆడటం లేదు. అతను త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం. ఆర్సీబీ అతనికి తమ వంతు సహకారం అందిస్తూనే ఉంటుంది' అని ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు.

rajat patidar ruled out

అలాగే జట్టు కోచ్‌లు, మేనేజ్‌మెంట్ ఇంకా అతని రిప్లేస్‌మెంట్‌పై నిర్ణయం తీసుకోలేదని ఆర్సీబీ తెలిపింది. గతేడాది ఆర్సీబీ నాకౌట్స్ చేరడంలో పటీదార్ కీలక పాత్ర పోషించాడు. అతనికి అవకాశం ఇచ్చిన ప్రతి మ్యాచులోనూ రాణించాడు. ఇక ఎలిమినేటర్‌లో లక్నోపై అతను బాదిన సెంచరీని ఆర్సీబీ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ తర్వాత రాజస్థాన్‌తో జరిగిన ఎలిమినేటర్-2లో కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.ఈ క్రమంలో ఈ ఏడాది ఆర్సీబీకి అతను చాలా కీలకం అని అంతా అనుకున్నారు.

దానికితోడు దేశవాళీల్లో కూడా పటీదార్ చెలరేగాడు. అతని ఫామ్ ఆర్సీబీకి కలిసొస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఐపీఎల్ ప్రారంభానికి ముందు అతనికి గాయం అవడంతో కొన్ని మ్యాచులు ఆడడని భావించారు. ఇప్పుడు పూర్తిగా ఈ సీజన్‌కు దూరమైనట్లు ప్రకటించారు. ఆర్సీబీకి ఈ ఐపీఎల్‌లో గాయాల బెడద చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికే జోష్ హాజిల్‌వుడ్, విల్ జాక్స్ కూడా గాయలతో జట్టుకు దూరమయ్యారు. ముంబైతో మ్యాచులో రీస్ టాప్లీ కూడా గాయపడ్డాడు. ఇప్పుడు పటీదార్ కూడా దూరమయ్యాడు.

Story first published: Tuesday, April 4, 2023, 16:30 [IST]
Other articles published on Apr 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+