For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నైట్ రైడర్స్ ఆటగాడికి గాయం, లీగ్ పాల్గొంటాడనేది...?

Big blow for KKR: Captain-frontrunner Chris Lynn suffers shoulder injury before IPL 2018

హైదరాబాద్: ఐపీఎల్ ఆరంభానికి ముందే కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కు చేదు వార్త ఎదురైంది. ఇంకో నెల రోజుల్లో మొదలుకాబోతున్న ఐపీఎల్‌కు నైట్ రైడర్స్ జట్టులో ప్రధాన ఆటగాడు అందుబాటులో ఉంటాడా.. లేదా.. అనే సందిగ్ధత నెలకొంది. ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ లిన్ నైట్ రైడర్స్ జట్టును ముందుండి నడిపించాల్సిన స్థానంలో ఉన్న క్రిస్ లిన్‌కు ఎడమ భుజానికి గాయమైంది.

కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ జట్టులో 2014 నుంచి:

కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ జట్టులో 2014 నుంచి:

ఇటీవలే అతని ఎడమ భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న క్రిస్ లిన్ మళ్లీ అదే చేతికి గాయమవడంతో విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఎప్పటికల్లా అందుబాటులో ఉంటాడనే విషయం వైద్యులు చెప్పలేకపోతున్నారు. షారూఖ్ ఖాన్ సహ యజమానిగా కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ జట్టులో 2014 నుంచి ఆడుతున్నాడు క్రిస్ లిన్.

కెప్టెన్ ఎవరో తెలియక..!?

కెప్టెన్ ఎవరో తెలియక..!?

రిటెన్షన్ జాబితాలో ఉంచుకోకుండా గౌతం గంభీర్‌ను జట్టు వదిలిపెట్టేసింది. అతనే స్వయంగా నిరాకరించడంతో ఐపీఎల్ వేలంలోనూ కొనుగోలు చేయలేదు. దీంతో జట్టుకు ప్రస్తుత కెప్టెన్ ఎవరనేది ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో క్రిస్ లిన్ పేరు పరిశీలనలో ఉంది. ఈ గాయంతో అతను మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడనేది ప్రశ్నగా మారడంతో నైట్ రైడర్స్ జట్టు మళ్లీ ఆలోచనలో పడింది.

ఎడమ భుజానికి ఇటీవలె చికిత్స:

ఎడమ భుజానికి ఇటీవలె చికిత్స:

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్ల మధ్య టీ 20 మ్యాచ్ జరుగుతోంది. బుధవారం ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొమ్మిదో ఓవర్లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ షాట్ కొట్టాడు. దానిని ఆపేందుకు ప్రయత్నించిన క్రిస్ లిన్ ముందుకు దూకాడు. అదే సమయంలో అతని ఎడమ చేతి మీదుగా బరువుంచి పడటంతో అను గాయానికి గురైయ్యాడు.

నైట్ రైడర్స్ జట్టుకు ఆడడం ఇష్టం:

నైట్ రైడర్స్ జట్టుకు ఆడడం ఇష్టం:

దీంతో అతను ఇప్పటిలో మ్యాచ్ ఆడేందుకు సరిపడ ఫిట్‌గా లేడంటూ వైద్యులు పేర్కొన్నారు. ఈ ప్రమాదం గురించి క్రిస్ లిన్ స్పందించి ఇలా మాట్లాడారు. 'నాకు క్రికెట్ ఆడటమే ఇష్టం. దాని కోసం దూకాల్సి వచ్చింది. అందుకే అలా చేశా. మా కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టులోని క్రీడాకారులందరూ ఒక జట్టుగా కలిసి ఉంటాం' అని పేర్కొన్నాడు.

కోల్ కత్తా నైట్ రైడర్స్:

బెంగుళూరు వేదికగా జనవరి 27, 28 తేదీల్లో జరిగిన వేలంలో క్రిస్ లిన్‌ను కోల్‌కత్తా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. అతని ప్రస్తుత ఖరీదు రూ. 9.6కోట్లు

Story first published: Wednesday, February 21, 2018, 14:44 [IST]
Other articles published on Feb 21, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+