Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ క్రికెటర్ ఔట్!

టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో గాయపడ్డాడు. హర్షిత్ రాణా వేసిన బంతికి అలెక్స్ కేరీ క్యాచ్ పడుతున్న సమయంలో శ్రేయస్ అయ్యర్‌ ఎడమ పక్కటెముకలకు గాయం తగిలింది. ప్రాథమిక నివేదిక ప్రకారం.. శ్రేయస్ అయ్యర్ దాదాపు మూడు వారాల పాటు మైదానానికి దూరంగా ఉండాల్సి వస్తుంది.

శనివారం ఈ సంఘటన జరిగింది. శ్రేయస్ అయ్యర్ డీప్ స్క్వేర్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా.. అలెక్స్ కేరీ కొట్టిన షాట్ వేగంగా అతని వైపు వచ్చింది. శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా డైవ్ చేసి క్యాచ్ పట్టినప్పటికీ.. అదే సమయంలో అతని పక్కటెముకలకు బలంగా తగిలింది. వెంటనే వైద్య సిబ్బంది మైదానంలోకి వచ్చి ముందు జాగ్రత్తగా స్కానింగ్ కోసం శ్రేయస్ అయ్యర్‌ను సిడ్నీలోని ఆస్పత్రికి తరలించారు.

Big Blow for Team India Shreyas Iyer Injured During Sydney ODI Ruled Out for Three Weeks

3 వారాలు మైదానానికి దూరం
బీసీసీఐ సీనియర్ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం.. "శ్రేయస్ అయ్యర్‌ను మ్యాచ్ జరుగుతుండగానే ఆస్పత్రికి పంపించడం జరిగింది. ప్రాథమిక స్కానింగ్ నివేదికలో శ్రేయస్ అయ్యర్‌కు పక్కటెముకల గాయం అయినట్లు తెలిసింది. అతనికి కనీసం మూడు వారాల విశ్రాంతి అవసరం. ఒకవేళ ఇది హెయిర్‌లైన్ ఫ్రాక్చర్ అయితే, కోలుకోవడానికి మరింత ఎక్కువ సమయం పట్టవచ్చు.' అని వెల్లడించారు. శ్రేయస్ అయ్యర్ తిరిగి వచ్చిన తర్వాత 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని, అక్కడ అయ్యర్ ఫిట్‌నెస్‌ను మరింత పరీక్షించిన తర్వాతే టీమిండియాలోకి అతని పునరాగమనం గురించి నిర్ణయం తీసుకుంటారని ఆ వర్గాలు తెలిపాయి.

దక్షిణాఫ్రికా పర్యటనకు శ్రేయస్ అయ్యర్ దూరమయ్యే అవకాశం
ఈ గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ దక్షిణాఫ్రికా పర్యటనలో ఆడటం అనుమానాస్పదంగా మారింది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి వన్డే నవంబర్ 30న రాంచీలో జరగనుంది. ఈ సమయానికి శ్రేయస్ అయ్యర్ ఫిట్‌గా ఉంటాడో లేదో ఇప్పడే చెప్పలేమని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. "రాంచీ వన్డేకు అతను అందుబాటులో ఉంటాడా లేదా అనేది ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. అంతా మెడికల్ రిపోర్ట్‌పై ఆధారపడి ఉంటుంది" అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

శ్రేయస్ అయ్యర్ ఇటీవలి నెలల్లో భారత వన్డే జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో శ్రేయస్ అయ్యర్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ మిడిల్ ఆర్డర్‌కు స్థిరత్వాన్ని ఇస్తుంది. అయితే దక్షిణాఫ్రికా వంటి కఠినమైన సిరీస్‌కు ముందు ఈ గాయం జట్టు నిర్వహణకు ఆందోళన కలిగించే విషయం. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1తో గెలుచుకుంది. భారత్ కేవలం చివరి మ్యాచ్‌లో విజయం సాధించింది. ఇప్పుడు టీమిండియా 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది.

Story first published: Sunday, October 26, 2025, 10:12 [IST]
Other articles published on Oct 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+