Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND W vs AUS W: సెమీఫైనల్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్!

IND W vs AUS W: ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025లో రెండో సెమీఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనుంది. అక్టోబర్ 30న నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరగనున్న ఈ మ్యాచ్ కోసం ప్రస్తుతం రెండు జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. అదే సమయంలో ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టుకు గుడ్ న్యూస్ లభించింది. ఇప్పుడు ఆస్ట్రేలియా మహిళా జట్టు మరింత పటిష్టంగా కనిపిస్తోంది.

ఆస్ట్రేలియా జట్టుకు గుడ్ న్యూస్
లీగ్ దశలోన చివరి మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా కెప్టెన్, వికెట్ కీపర్-బ్యాటర్ అయిన ఎలిసా హీలీ ట్రైనింగ్ సమయంలో తన పిక్క కండరానికి గాయం తగిలింది. ఈ కారణంగానే ఆమె ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆడలేదు. దీంతో ఆ మ్యాచ్‌కు తహ్లియా మెక్‌గ్రాత్ కెప్టెన్‌గా వ్యవహరించింది. లీగ్ దశలో తమ అన్ని మ్యాచ్‌లలో విజయం సాధించిన ఆస్ట్రేలియా మహిళా జట్టు ఇప్పుడు సెమీఫైనల్ కు సిద్ధమవుతోంది. మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియాకు శుభవార్త అందింది. కెప్టెన్ ఎలిసా హీలీ పూర్తిగా ఫిట్‌గా ఉంది. సోమవారం ఆమె ఉత్సాహంగా ప్రాక్టీస్ చేసింది. దీంతో ఆమె సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Big Blow for Team India Before Semifinal Huge Boost for Australia

టీమిండియాపై హీలీ బ్యాట్ పవర్
టీమిండియాతో లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ ఎలిసా హీలీ 107 బంతుల్లో 21 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో 142 పరుగులు చేసింది. భారత్‌పై ఎలిసా హీలీ బ్యాట్ ఎప్పుడూ పరుగుల వర్షం కురిపిస్తుంది. దీంతో సెమీఫైనల్ మ్యాచ్‌లో ఎలిసా హీలీ తిరిగి రావడం హర్మన్‌ప్రీత్ కౌర్ ఆందోళనలను పెంచనుంది. ఈ టోర్నమెంట్‌లో హీలీ ఇప్పటికే 2 సెంచరీలు చేసింది. కాబట్టి ఆమె తిరిగి రాకతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ మరింత బలంగా మారుతుంది. ఈ నేపథ్యంలో టీమిండియా విజయం సాధించాలంటే 200 శాతం శక్తిని వెచ్చించాల్సి ఉంటుంది.

Story first published: Wednesday, October 29, 2025, 15:12 [IST]
Other articles published on Oct 29, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+