Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గౌహతి టెస్ట్‌కు ముందు దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్!

IND vs SA: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికా 30 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోతి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 124 పరుగుల టార్గెట్‌ను ఛేదించడంలో విఫలమై 93 పరుగులకే ఆలౌట్ అయింది. కోల్‌కతా టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించడంలో ఆ జట్టు స్పిన్నర్ సైమన్ హార్మర్ కీలక పాత్ర పోషించారు. తన అద్భుతమైన బౌలింగ్‌తో టీమిండియా బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి హార్మర్ మొత్తం 8 వికెట్లు తీశారు. అందుకు గాను అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది.

హార్మర్‌కు ఏమైంది?
అయితే గౌహతి టెస్ట్ ప్రారంభానికి ముందు సైమన్ హార్మర్ ఆస్పత్రి పాలయ్యాడు. ఓ నివేదిక ప్రకారం, హార్మర్‌కు భుజం గాయం అయ్యింది. ఈ గాయం ఎంత తీవ్రమైనదో ఇంకా తెలియరాలేదు. తదుపరి వైద్య పరీక్షల కోసం మంగళవారం నాడు కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి ఆయనను తరలించారు. ప్రస్తుతం వైద్య నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. కాబట్టి భారత్‌తో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌కు హార్మర్ అందుబాటులో ఉంటాడా లేదా అనేది ఇప్పుడే చెప్పడం కష్టం.కోల్‌కతాలో జరిగిన మొదటి టెస్ట్ సమయంలో ఫీల్డింగ్ చేస్తుండగా హార్మర్‌కు గాయమైంది.

Big Blow for South Africa Ahead of Guwahati Test Kolkata Hero Simon Harmer Hospitalized

మార్కో యాన్సెన్ కూడా..
దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్ కూడా అదే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. అతనికి నిగుల్ (Niggle) సమస్య ఉంది. యాన్సెన్ కూడా మొదటి టెస్ట్‌లో 5 వికెట్లు తీసి మంచి ప్రదర్శన కనబరిచారు. దక్షిణాఫ్రికా జట్టు భారత్‌లో టెస్ట్ మ్యాచ్ గెలవడం 15 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. అంతకుముందు 2010లో నాగ్‌పూర్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా భారత్‌ను ఇన్నింగ్స్, 6 పరుగుల తేడాతో ఓడించింది.

Story first published: Wednesday, November 19, 2025, 10:13 [IST]
Other articles published on Nov 19, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+