For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంకో బౌలర్ అవుట్ - టైటిల్ హాట్ ఫేవరెట్‌కు దెబ్బ మీద దెబ్బ: కప్పు కాదు కదా అదీ కష్టమే..!!

Big blow for England as its left-arm bowler Reece Topley ruled out of entire T20 World Cup 2022

మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌కు గాయాల బెడద వెంటాడుతూనే ఉంది. ఈ టోర్నమెంట్ ఆరంభానికి ముందే టీమిండియా నుంచి ఇద్దరు కీలక బౌలర్లు తప్పుకొన్నారు. స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, టీ20 స్పెషలిస్ట్ బౌలర్ దీపక్ చాహర్.. టోర్నీ నుంచి వైదొలిగారు. శ్రీలంక ఇదే ఇబ్బందిని ఎదుర్కొంది. ఇప్పటికే లెఫ్ట్ ఆర్మ్ సీమ్ బౌలర్ దిల్షాన్ మధుశంక గాయపడ్డాడు. ఈ టోర్నమెంట్ మొత్తం నుంచీ తప్పుకొన్నాడు.

దుష్మంత చమీరా..

దుష్మంత చమీరా..

తాజాగా ఫాస్ట్ బౌలర్ దుష్మంత చమీర కూడా గాయపడ్డాడు. యూఏఈపై జరిగిన మ్యాచ్ సందర్భంగా అతను గాయపడ్డాడు. చీలమండ గాయానికి గురయ్యాడు. తన బౌలింగ్ కోటాను కూడా పూర్తి చేయలేకపోయాడు. తన నాలుగో ఓవర్ అయిదో బంతిని వేయడానికి రన్నప్ తీసుకున్న సమయంలో కండరాలు పట్టేశాయి. దీనితో ఆ ఓవర్‌ను పూర్తి చేయలేకపోయాడు. గ్రౌండ్ నుంచి వెళ్లిపోయాడు. ఆ మిగిలిన ఒక్కబంతినీ శనక వేశాడు.

హయ్యెస్ట్ వికెట్ టేకర్..

హయ్యెస్ట్ వికెట్ టేకర్..

యూఏఈ మ్యాచ్‌లో శ్రీలంక ఇన్నింగ్‌లో హయ్యెస్ట్ వికెట్ టేకర్ అతనే. 3.5 ఓవర్లల్లో 15 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. యూఏఈ కేప్టెన్ సీపీ రిజ్వాన్, వికెట్ కీపర్ ఆర్యన్ లక్రా, ముహమ్మద్ వసీం వికెట్లనుపడగొట్టాడు దుష్మంత చమీర. ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే దిల్షాన్ మధుశంక గాయం వల్ల వైదొలగడంతో బలహీన పడ్డ బౌలింగ్ విభాగాన్ని చమీర బలోపేతం చేశాడనుకున్న దశలో అతను కూడా గాయపడటం లంకేయులకు పెద్ద దెబ్బ.

మధుశంక కూడా..

మధుశంక కూడా..

ఇదివరకే మధుశంక గాయపడ్డ విషయం తెలిసిందే. తొడ కండరాల్లో గాయం వల్ల తప్పుకోవాల్సి వచ్చింది. కనీసం ఆరు వారాల పాటు విశ్రాంతి అవసరమని తేలింది. ఇద్దరు కీలక బౌలర్లు గాయాల బారిన పడి - టోర్నమెంట్ మొత్తం నుంచే తప్పుకోవాల్సి రావడం శ్రీలంక జట్టును ఆందోళనకు గురి చేస్తోంది. టీమిండియాలాగా శ్రీలంకకు రీప్లేస్‌మెంట్ ప్లేయర్లు కూడా పెద్దగా ఉన్నట్లు కనిపించట్లేదు. ఇది ఆ జట్టు విజయావకాశాలను దెబ్బతీయొచ్చు.

ఇంగ్లాండ్ బౌలర్..

ఇంగ్లాండ్ బౌలర్..

ఇప్పుడు ఇంగ్లాండ్‌ గాయాలబారిన పడింది. దీని దెబ్బకు టైటిల్ హాట్ ఫేవరెట్‌గా అడుగు పెట్టిన ఇంగ్లాండ్‌కు బౌలింగ్ డిపార్ట్‌మెంట్ బలహీనపడినట్టే. ప్రధాన బౌలర్ రీస్ టోప్లే గాయపడ్డాడు. అతను టోర్నమెంట్ నుంచి వైదొలగినట్లు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. రీస్ టోప్లే స్థానంలో మరొకరిని ఇంకా ఎంపిక చేయాల్సి ఉంది. రిచర్డ్ గ్లీసన్ లేదా టైమల్ మిల్స్‌తో అతని స్థానాన్ని భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. వీరిద్దరూ రిజర్వ్ ప్లేయర్ల కింద ఉన్నారు.

కాలి మడమ గాయంతో..

కాలి మడమ గాయంతో..

పాకిస్తాన్‌తో వామప్ మ్యాచ్‌కు ముందు నెట్ ప్రాక్టీస్ సమయంలో రీస్ టోప్లే గాయపడ్డాడు. అతని కాలి మడమ చిట్లింది. దీన్ని టోబ్లెరోన్స్‌గా గుర్తించారు. ఈ ఏడాది ఇంగ్లాండ్ జట్టులో ప్రధాన బౌలర్‌గా ఎదిగాడు టోప్లే. జట్టులో పునరాగమనం తరువాత ఆడిన టీ20 మ్యాచ్‌లల్లో 17 వికెట్లు తీసుకున్నాడు. వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఏడు మ్యాచ్‌లలో 13 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. పవర్‌ ప్లే, మిడిల్, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా టోప్లేను జట్టులోకి తీసుకుంది ఈసీబీ.

ప్రపంచ కప్ సూపర్ 12కు ముందే..

ప్రపంచ కప్ సూపర్ 12కు ముందే..

నిజానికి టీ20 ప్రపంచకప్ 2022లో అసలు పోరు ఇంకా ఆరంభం కావాల్సి ఉంది. శనివారం నుంచి సూపర్ 12 మ్యాచ్‌లు మొదలవుతాయి. ఈలోపే దాదాపు అన్ని జట్లల్లో కూడా ప్లేయర్లు గాయాలబారిన పడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఇంగ్లిస్ కూడా గాయపడ్డాడు. ఇంగ్లాండ్ ఇప్పటికే జోఫ్రా అర్చర్‌ను కోల్పోయింది. టీమిండియాలో జస్‌ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్ లేరు. శ్రీలంక నుంచి మధుశంక, చమీర గాయాలబారిన పడ్డారు.

Story first published: Wednesday, October 19, 2022, 13:43 [IST]
Other articles published on Oct 19, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+