Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తృటిలో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నాడు: హెల్మెట్‌ను బలంగా తాకిన బంతి

Big Bash: ‘Nasty’ bouncer knocks Stars skipper John Hastings’ helmet clean off

హైదరాబాద్: హెల్మెట్‌కు ధన్యవాదాలు చెప్పాల్సిందే. ఆస్ట్రేలియా క్రికెటర్‌ జాన్‌ హేస్టింగ్స్‌ తృటిలో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నాడు. బిగ్ బాష్ లీగ్‌లో మెల్‌‌బోర్న్‌ స్టార్స్‌ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న జాన్‌ హేస్టింగ్స్‌ ప్రాణాలను హెల్మెట్ కాపాడిందంటే నమ్ముతారా?

అవును జాన్‌ హేస్టింగ్స్‌ ప్రాణాలను హెల్మెట్ కాపాడింది. బిగ్ బాష్ లీగ్‌లో భాగంగా మెల్‌‌బోర్న్‌ స్టార్స్‌-బ్రిస్బెన్‌ హీట్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. మెల్‌‌బోర్న్‌ స్టార్స్‌ కెప్టెన్‌ జాన్ హేస్టింగ్స్‌ బ్యాటింగ్‌ చేస్తున్న క్రమంలో బ్రిస్బెన్‌ హీట్‌ బౌలర్ బెన్ కటింగ్ వేసిన షార్ట్ బాల్ వేగంగా వచ్చి హెల్మెట్‌ను తాకింది.

దీంతో జాన్ హేస్టింగ్స్‌ హెల్మెట్‌ ఎగిరి పడింది. ఈ ఘటనలో హేస్టింగ్స్‌కు ఎలాంటి గాయం కాకపోవడంతో మైదానంలోని ఆటగాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ మరుసటి బంతికే హేస్టింగ్స్‌ పెవిలియన్‌కు చేరాడు. ఈ సమయంలో కామెంటరీ బాక్సులో ఉన్న మార్క్ హవాయి సైతం సంభ్రమాశ్చర్యానికి లోనయ్యాడు.

'బెన్ కటింగ్ వేసిన షార్ట్ బాల్ హేస్టింగ్ హెల్మెట్‌ను బలంగా తాకింది. అద్భుతమైన బంతి' అని కొనియాడాడు. మరోవైపు జాన్ హెస్టింగ్ సైతం తాను క్షేమంగా ఉన్నట్లు బంతి తగిలిన అనంతరం బెన్ కటింగ్‌కు చెప్పడం విశేషం. హెల్మెట్‌ లేకుంటే హేస్టింగ్స్‌ పరిస్థితేంటీ అని ప్లేయర్లంతా భయాందోళనలకు గురయ్యారు.

మూడేళ్ల క్రితం సరిగ్గా 2014లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో సౌత్ ఆస్ట్రేలియా-న్యూసౌత్‌వేల్స్ జట్ల మధ్య షెఫీల్డ్‌ షీల్డ్ మ్యాచ్‌లో సీన్ అబాట్ వేసిన బౌన్సర్ తలకు తగలడంతో ఫిలిప్‌ హ్యూస్‌ గాయపడి మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన క్రికెట్‌ చరిత్రలోనే ఓ విషాద ఘటనగా మిగిలిపోయింది.

Story first published: Wednesday, January 3, 2018, 12:32 [IST]
Other articles published on Jan 3, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+