సిడ్నీ బౌలర్లను చితకొట్టాడు: 68 బంతుల్లో ఫించ్ సెంచరీ, బద్దలైన రికార్డులివే!

హైదరాబాద్: మెల్‌బోర్న్ రెనిగేడ్స్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ టీ20ల్లో తనకు తిరుగులేదని నిరూపించాడు. బిగ్‌బాగ్ లీగ్‌లో భాగంగా సిడ్నీ సిక్సర్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరోన్ ఫించ్ 68 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సుల సాయంతో 109 పరుగులు చేశాడు.
టీ20ల్లో ఆరోన్ ఫించ్‌కు ఇది 10వ సెంచరీ కావడం విశేషం. ఫలితంగా 2012 తర్వాత మళ్లీ బిగ్‌బాష్ లీగ్‌లో ఆరోన్ ఫించ్ సెంచరీ సాధించాడు. 2012లో మెల్‌బోర్న్ స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరోన్ ఫించ్(111) పరుగులతో సెంచరీ సాధించాడు. మళ్లీ ఇన్నాళ్లకు సెంచరీ సాధించాడు. బీబీఎల్‌లో ఫించ్‌కు ఇది రెండో సెంచరీ.
బీబీఎల్‌లో రెండు సెంచరీలు
ఫలితంగా బీబీఎల్‌లో రెండు సెంచరీలు సాధించిన ల్యూక్ రైట్, క్రెయిగ్ సిమన్స్, ఉస్మాన్ ఖవాజా, డి ఆర్సీ షార్ట్‌ల సరసన ఇప్పుడు ఆరోన్ ఫించ్ చేరాడు. అంతేకాదు ఈ సెంచరీతో టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ(10)తో కలిసి రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్(22) సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు.
17వ ఓవర్‌లో 22 పరుగులు
సిడ్నీ సిక్సర్స్ బౌలర్ బెన్ ద్వార్షుయిస్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో ఆరోన్ ఫించ్ ఏకంగా 22 పరుగులు పిండుకున్నాడు. తొలుత 45 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన ఫించ్... ఆ తర్వాత సెంచరీ సాధించేందుకు 18 బంతులను మాత్రమే తీసుకున్నాడు. కాగా, టీ20ల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరోన్ ఫించ్ రెండో స్థానంలో ఉన్నాడు.
టీ20ల్లో ఫించ్ అత్యధిక స్కోరు 172
జింబాబ్వేపై ఆరోన్ ఫించ్ 172 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. విండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ 2013 ఐపీఎల్‌లో నమోదు చేసిన 175 పరుగులే టీ20ల్లో ఇప్పటివరకు అత్యధిక స్కోరు. ఫించ్ సెంచరీతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన మెల్‌బోర్న్ రెనిగేడ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications