అక్షయ్‌ను అనుకరించిన 'బాలా' ధావన్: ట్రోల్ చేసిన భువనేశ్వర్ కుమార్

హైదరాబాద్: రాజ్‌కోట్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి సిరిస్‌ను 1-1తో సమం చేసింది. రెండో టీ20లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ-శిఖర్ ధావన్‌లు వందకు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
ఓపెనర్ రోహిత్ శర్మ 85 పరుగులతో తన టీ20 కెరీర్‌లో ఐదో సెంచరీని మిస్సవగా... శిఖర్ ధావన్ 31 పరుగుల వద్ద తొలి వికెట్‌గా ఔటయ్యాడు. ఈ క్రమంలో టీ20ల్లో రోహిత్ శర్మతో కలిసి వందకు పైగా పరుగుల భాగస్వామ్యాల్ని అత్యధిక సార్లు నెలకొల్పిన రికార్డులో ధావన్ భాగమయ్యాడు.
ప్రస్తుతం ఇరు జట్లు ఈ సిరిస్‌లో ఆఖరిదైన మూడో టీ20 కోసం సన్నద్ధమవుతున్నాయి. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఆఖరి టీ20 నాగ్‌పూర్ వేదికగా ఆదివారం జరగనుంది. ఈ టీ20లో గనుక బంగ్లాదేశ్ విజయం సాధిస్తే చరిత్ర సృష్టిస్తుంది. ఎందుకంటే టీ20 క్రికెట్ చరిత్రలో బంగ్లా ఇప్పటివరకు భారత్‌పై టీ20 సిరిస్ నెగ్గలేదు.
అయితే, మూడో టీ20కి ముందు శిఖర్ ధావన్ తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో ఇటీవలే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన హౌస్‌ఫుల్-4 చిత్రంలో ఓ సన్నివేశాన్ని స్పిన్నర్ యజువేంద్ర చాహల్, పేసర్ ఖలీల్ అహ్మాద్‌తో కలిసి చేశాడు.
ఈ వీడియోని ధావన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా... భువీ సరదాగా స్పందించాడు. "యాక్టింగ్‌ను మర్చిపోయినట్లు నటించాల్సిన అవసరం ఏముంది. నీ యాక్టింగ్ వచ్చు కదా" అని కామెంట్ పెట్టాడు. వరల్డ్‌కప్ తర్వాత జరిగిన విండిస్ పర్యటనలో భువీ గాయపడటంతో ప్రస్తుతం ఆ గాయం నుంచి కోలుకుంటున్నాడు.
View this post on InstagramBala ke side effects 😂 @akshaykumar @khaleelahmed13 @yuzi_chahal23
A post shared by Shikhar Dhawan (@shikhardofficial) on
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications