
హైదరాబాద్: తాను తండ్రిని కాబోతున్నానంటూ వస్తున్న మీడియాలో వస్తోన్న కథనాలపై టీమిండియా ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ స్పందించాడు. ఆ వార్తల్లో నిజం లేదని, తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దంటూ ముంబై మిర్రర్‌పై భువనేశ్వర్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ముంబై మిర్రర్ తన కథనంలో రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్‌లు తొలిసారి తండ్రులు కాబోతున్నారంటూ ఓ వార్తా కథనంలో పేర్కొంది. ఈ కథనంపై స్పందించిన భువనేశ్వర్ కుమార్ తన ట్విట్టర్‌లో "నేను తండ్రిని కాబోతున్నానంటూ మీడియా మరోసారి తప్పుడు కథనాన్ని ప్రచురించింది. దయచేసి ఇటువంటి తప్పుడు కథనాలను ప్రచారం చేయవద్దు. నిజానిజాలు ధ్రువీకరించుకోకుండా వ్యక్తిగత విషయాలను ఇలా ప్రచారం చేయడం సరికాదు" అని ముంబై మిర్రర్‌ను ట్యాగ్ చేస్తూ భువీ ట్వీట్ చేశాడు.
నవంబర్ 23, 2017న భువనేశ్వర్ కుమార్ తన భార్య నుపర్ నగార్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 28 ఏళ్ల భువనేశ్వర్ కుమార్ త్వరలో తండ్రి కాబోతున్నడంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలను భువీ ట్విట్టర్ వేదికగా ఖండించడం విశేషం.
ఇంగ్లాండ్‌లో వన్డే సిరిస్ ముగిసిన తర్వాత గాయపడిన భువనేశ్వర్ కుమార్ ఆ తర్వాత టెస్టు సిరిస్‌కు దూరమయ్యాడు. అనంతరం భారత్-ఏ తరుపున దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసి యూఏఈ వేదికగా జరిగిన ఆసియాకప్‌లో భువీ చోటు దక్కించుకున్నాడు.
ఆసియా కప్‌లో భారత్ విజయం సాధించడంతో కీలకపాత్ర పోషించాడు. ఆసియా కప్ ముగిసిన తర్వాత ప్రస్తుతం వెస్టిండిస్‌తో జరుగుతున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ నుంచి సెలక్టర్లు భువనేశ్వర్ కుమార్‌కి విశ్రాంతి కల్పించారు. టెస్టు సిరిస్ అనంతరం భారత్-విండిస్ జట్ల మధ్య ఐదు వన్డేల సిరిస్ జరగనుంది.
ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా మొదటి రెండు వన్డేలకు సెలక్టర్లు ప్రకటించిన జట్టులో కూడా భువనేశ్వర్ కుమార్‌కి విశ్రాంతినిచ్చారు. వెస్టిండిస్‌తో ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా తొలి వన్డే అక్టోబర్ 21న గౌవహటిలోని బర్సపుర స్టేడియంలో జరగనుంది. విండిస్‌తో సిరిస్ ముగిసిన తర్వాత టీమిండియా ఆసీస్ పర్యటనకు వెళ్లనుంది.