Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన భువనేశ్వర్ కుమార్!!

ఐపీఎల్ స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ నిలకడ ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచులో ఆల్ టైమ్ రికార్డ్ ను సెట్ చేశాడు. ఈ మ్యాచులో భువనేశ్వర్ కుమార్ (4-0-23-1) బౌలింగ్ ఫిగర్ ను నమోదు చేశాడు. తద్వారా ఈ మెగా లీగ్ లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు.

ఈ మ్యాచులో పవర్‌ప్లే లో గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను ఔట్ చేశాడు భువనేశ్వర్ కుమార్. ఐదో ఓవర్ నాలుగో బంతికి గిల్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా, లియామ్ లివింగ్‌స్టోన్ బంతిని అద్భుతమైన క్యాచ్ పట్టి పెవిలియన్‌కు పంపాడు. ఈ వికెట్ తోనే భువనేశ్వర్ కుమార్.. అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ల జాబితాలోకి చేరాడు.

అలానే వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో రికార్డును సమం చేశాడు భువనేశ్వర్ కుమార్. బ్రావో, భువీ కలిసి ఇద్దరూ ఇప్పటివరకు ఐపీఎల్ లో 183 వికెట్లను పడగొట్టారు. బ్రావో 161 మ్యాచుల్లో ఈ అత్యధిక వికెట్ల (183) రికార్డును చేరగా, భువనేశ్వర్ కుమార్ కు 178 మ్యాచులు పట్టింది. 7.55 ఎకానమీతో ఈ వికెట్లు పడగొట్టాడు భువీ. ఇందులో రెండు సార్లు ఐదు వికెట్లు ప్రదర్శన ఉంది. మొత్తంగా ఈ ఐపీఎల్ ఆల్ టైమ్ వికెట్ టేకర్స్ లిస్ట్ లో మూడో స్థానాన్ని సంపాదించుకున్నాడు భువీ. భువనేశ్వర్ కుమార్ కన్నా ముందు చాహల్ (206), పీయూశ్ చావా (192) వికెట్లతో టాప్ పొజిషన్ లో ఉన్నారు.

అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్లు వీరే..
యుజ్వేంద్ర చహల్ - 206 వికెట్లు (161 ఇన్నింగ్స్‌లు)
పియూష్ చావ్లా - 192 వికెట్లు (191 ఇన్నింగ్స్‌లు)
డ్వేన్ బ్రావో - 183 వికెట్లు (158 ఇన్నింగ్స్‌లు)
భువనేశ్వర్ కుమార్ - 183 వికెట్లు (178 ఇన్నింగ్స్‌లు)
రవిచంద్రన్ అశ్విన్ - 183 వికెట్లు (211 ఇన్నింగ్స్‌లు)
సునీల్ నరైన్ - 181 వికెట్లు (177 ఇన్నింగ్స్‌లు)

Story first published: Thursday, April 3, 2025, 11:50 [IST]
Other articles published on Apr 3, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+