Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

15 ఏళ్ల కుర్రాడి విధ్వంసం.. భువీ రియాక్షన్ ఇదే!

ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ కనుగొన్న అద్భుత వజ్రమే వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రపంచస్థాయి బౌలర్లను గడగడలాడిస్తూ వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. శుక్రవారం(ఏప్రిల్ 10) నాడు గౌహతి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ మరోసారి తన ప్రతాపాన్ని చూపించాడు. భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ వంటి హేమాహేమీలను ఎదుర్కొంటూ కేవలం 26 బంతుల్లో 78 పరుగులు బాది.. ఆర్సీబీ ఆశలపై నీళ్లు చల్లాడు. వైభవ్ ఫియర్లెస్ బ్యాటింగ్ తీరు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.

చిన్నవాడైనా పరిణతి కలిగిన ఆటగాడు: భువనేశ్వర్ కుమార్
మ్యాచ్ అనంతరం ఆర్సీబీ సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్.. వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్‌ను మనస్ఫూర్తిగా అభినందించాడు. ఓ టీనేజర్ తమ బౌలింగ్‌ను చితకబాదడంపై తమకు ఎలాంటి ప్రతికూల భావన లేదని భువీ స్పష్టం చేశాడు. "ఇది టీ20 ఫార్మాట్.. ఇక్కడ వయసుతో సంబంధం లేదు. వైభవ్ చాలా చిన్నవాడైనా, క్రీజులో అతని పరిణతి చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. మమ్మల్ని ఒక 15 ఏళ్ల కుర్రాడు కొట్టాడని మేం బాధపడటం లేదు, టీ20 క్రికెట్‌లో ఇదొక భాగం మాత్రమే" అని భువీ వ్యాఖ్యానించాడు.

Bhuvneshwar Kumar Praises Vaibhav Suryavanshi 26-ball 78 in IPL 2026 Says Age is Just a Number

వ్యూహాలు ఫలించలేదు.. క్రెడిట్ అంతా అతనిదే!
ఈ మ్యాచ్‌లో తమ ప్లానింగ్ సరిగ్గా అమలు కాలేదని భువనేశ్వర్ అంగీకరించాడు. పవర్‌ప్లేలో ఓ క్యాచ్ చేజార్చడం, లైన్ అండ్ లెంగ్త్ తప్పడం వంటి పొరపాట్లు జరిగాయని, అయితే వైభవ్ ఆడిన షాట్లు అద్భుతమని కొనియాడాడు. "అతను కేవలం బంతిని బలంగా బాదడమే కాకుండా, ప్రాపర్ క్రికెట్ షాట్లు ఆడుతున్నాడు. ఇన్ని తక్కువ బంతుల్లో అంత పెద్ద స్కోరు సాధించిన ఘనత పూర్తిగా వైభవ్‌కే దక్కుతుంది. అతని బ్యాటింగ్ వల్లే మ్యాచ్ మా చేతుల్లోంచి జారిపోయింది" అని భువీ పేర్కొన్నాడు.

ఆర్సీబీ పోరాటం.. తదుపరి లక్ష్యం ముంబై
ఆర్సీబీ బ్యాటింగ్ గురించి విశ్లేషిస్తూ.. ఓ దశలో తమ జట్టు 94 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిందని భువీ గుర్తు చేశాడు. ఆ సమయంలో కెప్టెన్ రాజత్ పటీదార్ (63 పరుగులు), వెంకటేష్ అయ్యర్, రొమారియో షెపర్డ్ అద్భుతంగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారని తెలిపాడు. చివరి వరకు పోరాడినా వైభవ్ సృష్టించిన మెరుపుల వల్ల విజయం చేజారిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఆర్సీబీ తన తదుపరి మ్యాచ్‌లో ఆదివారం వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.

Story first published: Saturday, April 11, 2026, 8:59 [IST]
Other articles published on Apr 11, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+