చూడండి: పేసర్ భువీ జీవిత భాగస్వామి ఎవరో తెలిసింది
హైదరాబాద్: మహిళా క్రికెట్ అభిమానులకు నిజంగా ఇది చేదువార్తే. టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ తనకు కాబోయే జీవిత భాగస్వామి ఎవరో అభిమానులకు చెప్పేశాడు. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన భువీ గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నాడు.

డిన్నర్ డేట్.. త్వరలో పూర్తి ఫొటో విడుదల చేస్తా
ఈ ఏడాది ఐపీఎల్ జరిగే సమయంలో ఓ రెస్టారెంట్లో తన గర్ల్‌ఫ్రెండ్‌తో కూర్చుని దిగిన ఫొటోలో తాను మాత్రమే కనిపించేటట్టు సోషల్‌మీడియాలో ఉంచి ‘డిన్నర్ డేట్.. త్వరలో పూర్తి ఫొటో విడుదల చేస్తా' అని ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన సందర్భంలో భువనేశ్వర్ చేతిలో గ్లాస్, అందులో రెండు స్ట్రాలు ఉన్న ఫొటోను అప్ లోడ్ చేసిన సంగతి తెలిసిందే.

తన భాగస్వామి ఎవరో అభిమానులకు చూపించిన భువీ
ఆ తర్వాత ఇన్నాళ్లకు భువీ తన భాగస్వామి ఎవరో అభిమానులకు చూపించాడు. తాజాగా తన ట్విటర్‌లో ఇద్దరూ కలిసి ఉన్న ఫొటో ఉంచి ‘నా జీవిత భాగస్వామి ఫొటో ఇదే' అంటూ అభిమానులకు చెప్పేశాడు. ఆమె పేరు నుపుర్ నగర్ అని భువీ తెలిపాడు.
త్వరలోనే వీరి పెళ్లి తేదీని ప్రకటిస్తా
ఈ ఫోటోలో వీరిద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. త్వరలోనే వీరి పెళ్లి తేదీని ప్రకటిస్తానని కూడా భువనేశ్వర్ తెలిపాడు. ఈ ఏడాది మేలో భువీ సగం ఫొటోని ట్విటర్ ద్వారా పంచుకున్నప్పుడు అతడు డేటింగ్ చేస్తోంది ప్రముఖ మోడల్, టాలీవుడ్ నటి అనుస్మృతి సర్కార్ అంటూ వార్తలు వచ్చాయి.

ఆమె ఎవరో కూడా నాకు తెలియదు
అయితే వీటిపై స్పందించిన భువీ ఆ వార్తలను ఖండించి 'ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. ఇలాంటి వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టండి. సమయం వచ్చినప్పుడు ఆమె ఎవరన్నది నేనే చెప్తాను' అని పేర్కొన్నాడు. ప్రస్తుతం భువీ శనివారం నుంచి ఆసీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications