న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సన్‌రైజర్స్ ప్లే‌ఆఫ్స్‌కు చేరాలంటే!: మిడిలార్డర్ సమస్యపై భువీ

IPL 2019 : Bhuvaneshwar Comments On Hyderabad Playoff Chances || Oneindia Telugu
Bhuvneshwar kumar on Sunrisers Hyderabad middle order

హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో మిడిలార్డర్ వైఫల్యమే ప్రధాన సమస్య అని ఆ జట్టు పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఈ మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తోంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

భువీ మాట్లాడుతూ

భువీ మాట్లాడుతూ

ఈ నేపథ్యంలో భువీ మాట్లాడుతూ సన్‌రైజర్స్ జట్టులో మిడిలార్డర్ సమస్య పరిష్కారమైతే జట్టు సమతూకంగా తయారవుతుందని చెప్పుకొచ్చాడు. "ఇప్పటికే వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నైను అడ్డుకోవడం అంత సులువు కాదు. అయితే, అన్ని విభాగాల్లో రాణిస్తే ఇద సాధ్యమే" అని భువనేశ్వర్ కుమార్ అన్నాడు.

ఎక్కువగా పరుగులు సమర్పించుకున్న భువీ

ఎక్కువగా పరుగులు సమర్పించుకున్న భువీ

ఈ సీజన్‌లో జరిగిన కొన్ని మ్యాచుల్లో తాను ఎక్కువగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ మళ్లీ తిరిగి ఫామ్‌ని అందుకున్నట్లు భువీ వెల్లడించాడు. ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లాడిన భువనేశ్వర్ కుమార్ కేవలం 5 వికెట్లు మాత్రమే తీశాడు. మరోవైపు ఈ సీజన్‌లో సన్‌‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆడిన ఏడు మ్యాచుల్లో మూడింట మాత్రమే విజయం సాధించింది.

ఆరో స్థానంలో కొనసాగుతోన్న సన్‌రైజర్స్

ఆరో స్థానంలో కొనసాగుతోన్న సన్‌రైజర్స్

దీంతో ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇక, చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే ఆడిన ఎనిమిది మ్యాచుల్లో ఏడింట విజయం సాధించింది. బుధవారం జరిగే మ్యాచ్‌లో గెలిస్తే చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఇక, సన్‌‌రైజర్స్‌ ప్లే ఆఫ్‌కు చేరాలంటే ఇంకా ఐదు మ్యాచుల్లో విజయం సాధించాలి.

Story first published: Wednesday, April 17, 2019, 14:55 [IST]
Other articles published on Apr 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X