గాయం కారణంగా తర్వాతి మ్యాచ్‌కు దూరం కానున్న హైదరాబాద్ మరో ఆటగాడు

హైదరాబాద్: వరుసగా రెండు మ్యాచ్‌లలోనూ పరాజయాన్ని చవిచూసిన హైదరాబాద్ జట్టుకు మరో ఆటంకం ఎదురైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లకు గాయాల బెడద పట్టుకుంది. సొంతగడ్డపై చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ శిఖర్‌ధావన్, భువనేశ్వర్ కుమార్ దూరమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో యూసఫ్ పఠాన్ కూడా కాస్త ఇబ్బంది పడ్డాడు. దీంతో ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌కి ఎవరు దూరం అవుతారో, తుది జట్టులో ఎవరెవరు ఉంటారనేది సందిగ్ధం.

హైదరాబాద్×ముంబై:
ఇప్పటికే ఈ మ్యాచ్‌కి భువనేశ్వర్ కుమార్ దూరమైనట్లు ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ వెల్లడించాడు. టోర్నీలో భాగంగా మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.

భువికి ఫిజియోలు విశ్రాంతి కావాలట:
భువనేశ్వర్ జట్టుతో పాటు ముంబై రాలేదు. నడుం నొప్పితో తీవ్రంగా బాధపడుతోన్న భువికి ఫిజియోలు విశ్రాంతి సూచించారు. అందుకే అతడు ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడటం లేదు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన ధావన్ ఈ మ్యాచ్‌కి అందుబాటులోకి వస్తాడని భావిస్తున్నా.

యూసుఫ్ పఠాన్ 100శాతం ఫిట్‌గా:
యూసుఫ్ పఠాన్ కూడా 100శాతం ఫిట్‌గా ఉన్నాడని చెప్పలేను. చెన్నై, పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో రషీద్ ఖాన్ భారీగా పరుగులిచ్చాడు. అతనో వరల్డ్ క్లాస్ బౌలర్. తదుపరి మ్యాచ్‌లో అతడు పుంజుకుంటాడు' అని ఆశాభావం వ్యక్తం చేశాడు.

రెండో సారి ముంబైతో:
టోర్నీ ఆరంభంలో హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఈ సీజన్‌లో రెండోసారి ముంబై ఇండియన్స్‌తో తలపడుతున్న సన్‌రైజర్స్ మరోసారి విజయాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. హైదరాబాద్ వేదికగా జరిగిన గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ వికెట్ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications