For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భువీ.. ఫిట్ నెస్ లేకుండానే వన్డేల్లో ఆడాడా..??

Bhuvneshwar Kumar Headed NCA BCCI Support Staff Under Scanner
Bhuvneshwar Kumar Headed to NCA, BCCI Support Staff Under Scanner

హైదరాబాద్: పూర్తి ఫిట్‌నెస్‌ లేదని తెలిసినా ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో భువనేశ్వర్‌ను ఆడించారా..? ఇప్పుడివే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీ20 సిరీస్‌ గెలిచిన టీమ్‌ఇండియా.. ఇంగ్లాండ్‌పై వన్డే సిరీస్‌ను ఎలాగైనా సాధించాలని కోరుకుందని.. అందుకే తొలి రెండు వన్డేలకు దూరమైన భువనేశ్వర్‌ను బరిలో దింపిందని సమాచారం.

భువి మూడో వన్డేలో ఆడటం అనుమానమే అనిపించి

భువి మూడో వన్డేలో ఆడటం అనుమానమే అనిపించి

టీ20 సిరీస్‌ గెలిచిన టీమ్‌ఇండియా.. మూడో వన్డేలో ఓడిపోవడంతో దానికి కారణాలన్నీ వెలికితీస్తున్నారు క్రికెట్ విమర్శకులు. ఇంగ్లాండ్‌పై వన్డే సిరీస్‌ను ఎలాగైనా సాధించాలని కోరుకుందని.. అందుకే తొలి రెండు వన్డేలకు దూరమైన భువనేశ్వర్‌ను బరిలో దింపిందని సమాచారం. మ్యాచ్‌ ముందు రోజు సహాయక కోచ్‌ సంజయ్‌ బంగర్‌ వ్యాఖ్యలను బట్టి చూస్తే భువి మూడో వన్డేలో ఆడటం అనుమానమే అనిపించింది.

భువనేశ్వర్‌ జట్టుకు చాలా ముఖ్యం

భువనేశ్వర్‌ జట్టుకు చాలా ముఖ్యం

‘భువనేశ్వర్‌ జట్టుకు చాలా ముఖ్యం. టెస్టు సిరీస్‌ నేపథ్యంలో సాహసాలు చేయం. అతడు ఫిట్‌గా ఉన్నాడంటనే.. మూడో వన్డేలో ఆడనిస్తాం' అని అతడు చెప్పాడు. ఐతే టాస్‌కు వెళ్లిన కోహ్లి.. భువి జట్టులో ఉన్నాడని తేల్చేశాడు. టెస్టు సిరీస్‌కు ముందు పేసర్లందరికీ అవకాశం ఇవ్వడంలో భాగంగానే అతడిని ఎంపిక చేశామని కోహ్లి చెప్పాడు.

మ్యాచ్‌ రోజు కూడా తనకు వెన్ను నొప్పి ఉందని

మ్యాచ్‌ రోజు కూడా తనకు వెన్ను నొప్పి ఉందని

మ్యాచ్‌ రోజు కూడా తనకు వెన్ను నొప్పి ఉందని భువి చెప్పాడట. ఐతే.. ఫిజియో నచ్చజెప్పడంతో అతడు బరిలో దిగాడని సమాచారం. మూడో వన్డేలో ఇబ్బందిగా కదిలిన భువి ప్రభావవంతంగా బౌలింగ్‌ చేయలేకపోయాడు. వెన్ను గాయం తీవ్రం కావడంతో అతడు ఇప్పుడు తొలి మూడు టెస్టులకు దూరం కావాల్సి వచ్చింది.

పూర్తి ఫిట్‌నెస్‌ లేని భువిని ఎలా ఆడించారని

పూర్తి ఫిట్‌నెస్‌ లేని భువిని ఎలా ఆడించారని

ఆ తర్వాతి 2 టెస్టుల్లో ఆడేది కూడా అనుమానమే. లండన్‌లో అతడు చికిత్స పొందనున్నాడు. పూర్తి ఫిట్‌నెస్‌ లేని భువిని ఎలా ఆడించారని బోర్డు కార్యదర్శి అమితాబ్‌ చౌదరి టీమ్‌ మేనేజ్‌మెంట్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. మరోవైపు భుజానికి శస్త్రచికిత్స చేయించుకోనున్న వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా కొన్ని నెలలు క్రికెట్‌కు దూరం కానున్నాడు.

Story first published: Friday, July 20, 2018, 9:36 [IST]
Other articles published on Jul 20, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+