నిశ్చితార్థం జరిగింది: భువీ జీవిత భాగస్వామి నుపుర్ ఎవరో కాదు!
హైదరాబాద్: టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన జీవిత భాగస్వామి ఎవరో, తాను ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నానో విషయాన్ని బుధవారం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే.
ఇందుకు సంబంధించిన ఓ ఫోటోను తన ఇనిస్టాగ్రామ్‌లో కూడా పోస్టు చేశాడు. తాను పోస్టు చేసిన అమ్మాయితోనే బుధవారం భువనేశ్వర్ కుమార్ నిశ్చితార్థం జరిగింది. మీరట్‌కు చెందిన తన ప్రేయసి నుపుర్ నగార్‌తో భువీ నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలు ఆన్‌లైన్‌లో హల్ చల్ చేస్తున్నాయి.
నోయిడాలో బుధవారం ఎంగేజ్‌మెంట్
ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నోయిడాలో బుధవారం ఈ వేడుక నిరాడంబరంగా జరిగింది. వీరిద్దరి వివాహం ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ నుపుర్ నగార్‌తో భువీతో ఎలా ప్రేమలో పడ్డాడనే విషయం కూడా వెలుగు చూసింది.

పక్కింటి అమ్మాయే
భువీ, నుపుర్ చిన్నప్పటి నుంచే స్నేహితులు. వీళ్ల కుటుంబాలు మీరట్‌లోని గంగానగర్‌లో ఇరుగు పొరుగున నివాసం ఉండేవి. దీంతో ఎప్పటి నుంచో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. దీనికి తోడు భువీ తండ్రి కిరణ్‌పాల్ సింగ్, నుపుర్ తండ్రి యశ్‌పాల్ సింగ్.. ఇద్దరూ ఉత్తర ప్రదేశ్ పోలీస్ శాఖలో పనిచేస్తున్నారు.

తన జీవిత భాగస్వామి వివరాలను దాచి పెట్టడంలో భువీ సక్సెస్
దీంతో భువీ, నుపుర్‌ల ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించారు. అయితే నిశ్చితార్థం వరకు తన జీవిత భాగస్వామి వివరాలను దాచి పెట్టడంలో భువీ సక్సెస్ అయ్యాడని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ జరిగే సమయంలో ఓ రెస్టారెంట్లో తన గర్ల్‌ఫ్రెండ్‌తో కూర్చుని దిగిన ఫొటోలో తాను మాత్రమే కనిపించేటట్టు ‘డిన్నర్ డేట్.. త్వరలో పూర్తి ఫొటో విడుదల చేస్తా' అని భువీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడు.

ఇదిగో మిగిలిన సగం ఫొటో నుపుర్ నగార్‌తో
దీంతో ఆ డేట్ ఫొటోలో ఉన్నది ఒకప్పటి హీరోయిన్ అంటూ అప్పట్లో ప్రచారం సాగింది. అయితే వీటిపై స్పందించిన భువీ ఆ వార్తలను ఖండించి 'ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. ఇలాంటి వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టండి. సమయం వచ్చినప్పుడు ఆమె ఎవరన్నది నేనే చెప్తాను' అని పేర్కొన్నాడు. ఆ తర్వాత బుధవారం హఠాత్తుగా భువీ తన భాగస్వామి ఎవరో అభిమానులకు చూపించాడు. తన ట్విటర్‌లో ఇద్దరూ కలిసి ఉన్న ఫొటో ఉంచి ‘ఇదిగో మిగిలిన సగం ఫొటో నుపుర్ నగార్‌తో' అని భువీ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications